నమ్రత డామినేషన్ కట్, మహేష్ పై రమా రాజమౌళి డామినేషన్

మహేష్ బాబు సినిమాలు అనగానే ఆయన భార్య నమ్రత డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మహేష్ ఏ సినిమా చేసినా సరే సినిమాలో మహేష్ బాబు లుక్, అలాగే మహేష్ బాబు చెప్పే డైలాగ్స్, దానితో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 04:30 PMLast Updated on: Feb 05, 2025 | 4:30 PM

Namrata Domination Cut Rama Rajamouli Domination On Mahesh

మహేష్ బాబు సినిమాలు అనగానే ఆయన భార్య నమ్రత డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మహేష్ ఏ సినిమా చేసినా సరే సినిమాలో మహేష్ బాబు లుక్, అలాగే మహేష్ బాబు చెప్పే డైలాగ్స్, దానితో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందని ప్రచారం ఉంది. ముందు నుంచి కూడా మహేష్ బాబు విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్తారు. మహేష్ బాబు ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఉంటారని… అప్పుడప్పుడు మహేష్ బాబు చేయబోయే సినిమాలకు సంబంధించి కథలు కూడా వింటూ ఉంటారని టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక ఒపీనియన్ ఉంటుంది.

అయితే ఇప్పుడు రాజమౌళి సినిమా విషయంలో మాత్రం నమ్రతాని పూర్తిగా పక్కన పెట్టినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రాజమౌళి సినిమా అంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంటుంది. ఇక ఆయన టీం చెప్పిందే చేయాల్సి ఉంటుంది. అది ఏ హీరో అయినా సరే… హీరోయిన్ల విషయంలో కూడా రాజమౌళి పక్కాగా ఉంటారు. తన సినిమా తాను అనుకున్నట్లే రావాలి అనేది రాజమౌళి పట్టుదల. ఎవరు జోక్యం చేసుకున్నా సరే.. రాజమౌళి మాత్రం ఒకటి కమిట్ అయితే దాని ప్రకారమే వర్క్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లాలని రాజమౌళి చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే షూటింగ్ స్పాట్ విషయంలో ఎక్కువ లేట్ చేయకుండా షూటింగ్ ఫైనల్ చేసేసారు. కెన్యాలోని నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్ లో హీరోయిన్ ప్రియాంక చోప్రా లేకుండానే షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కటి కూడా రాజమౌళి వైఫ్ రమా రాజమౌళి ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు.

మహేష్ బాబు కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె చెప్పింది ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక నమ్రత ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా సరే రమా రాజమౌళి.. ఆమె ఒపీనియన్ కూడా తీసుకోవట్లేదని సమాచారం. దీంతో షూటింగ్ స్పాట్ కు నమ్రత వెళ్లే ప్రయత్నం చేయటం లేదట. వాస్తవానికి మహేష్ బాబు ఎక్కడ షూటింగ్ చేసిన సరే ఫ్యామిలీతో వెళుతూ ఉంటాడని ప్రచారం ఒకటి ఉంది. ఈసారి నమ్రతా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేకుండానే రమ రాజమౌళి చాలా జాగ్రత్తగా మహేష్ లుక్ తో పాటుగా, ప్రతి ఒక్కటి తన కంట్రోల్లో ఉండే మాదిరిగానే జాగ్రత్త పడుతున్నారు. గతంలో కూడా రామ రాజమౌళి తన భర్త సినిమాల విషయంలో ఇంతే పక్కకు వ్యవహరించారు. ఎవరికోసమో చేంజ్ అయ్యే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.