Namrata Shirodkar: నమ్రత.. ఎందుకిలా..? జగన్ ప్లస్ మహేశ్ బాబు.. ఏం జరిగింది..?
గుంటూరు కారం పాటతో.. మహేష్, జగన్ ఫొటోలను షేర్ చేసింది నమ్రత. ఇదే ఇప్పుడు చాలామందిని కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఇన్‌స్టా స్టోరీలో మహేశ్, ఏపీ సీఎం జగన్.. మూచ్యువల్ వీడియోను షేర్ చేసింది. దానికి గుంటూరు కారంలోని దమ్ మసాలా సాంగ్ జత చేసి ఉంది.
Namrata Shirodkar: నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్యగా మహేశ్ ఇంటి బాధ్యతలే కాదు.. ఆయనకు సంబంధించిన ప్రతీ విషయం చూసుకుంటుంది. మహేష్ హీరోగా వచ్చిన గుంటూరు కారం.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కారణం ఏదైనా.. మహేష్ ఇలాంటి స్టోరీ ఎందుకు చేశాడా అని ఫ్యాన్స్ తెగ తిట్టేసుకుంటున్నారు. ఐతే గుంటూరు కారం రిలీజ్ తర్వాత.. నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు చాలా ప్రశ్నలు మిగిల్చింది.
Janasena Target : జనసేన టార్గెట్ టెన్ వీళ్లే ! ఓడించి తీరాలని కసితో ఉన్నారు !!
మహేష్ ఫొటోనో.. గుంటూరు కారం ఫొటోనో.. లేదంటే ఫ్యామిలీ ఫొటోనే షేర్ చేసి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. గుంటూరు కారం పాటతో.. మహేష్, జగన్ ఫొటోలను షేర్ చేసింది నమ్రత. ఇదే ఇప్పుడు చాలామందిని కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఇన్‌స్టా స్టోరీలో మహేశ్, ఏపీ సీఎం జగన్.. మూచ్యువల్ వీడియోను షేర్ చేసింది. దానికి గుంటూరు కారంలోని దమ్ మసాలా సాంగ్ జత చేసి ఉంది. ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తున్న చొక్కాపై గుండి అనే సాంగ్‌ను మహేష్‌బాబు, జగన్ వీడియోలతో ఎడిట్ చేశారు. దీన్ని నమ్రత.. తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. 17నిమిషాల పాటు ఈ వీడియో నమ్రతా ఆఫిషియల్ అకౌంట్‌లో స్టోరీగా కనిపించింది. ఐతే వెంటనే స్టోరీ నుంచి ఈ వీడియోను నమ్రత తొలగించినట్లుగా తెలుస్తోంది. అప్పటికే కొంతమంది రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చారు. ఇక సినిమాలోనూ ఓ ఫోటో వైరల్ అయింది.
సినిమాలో మహేశ్ పక్కన ఉన్న నటుడి మెడలో JDP పార్టీ పేరుతో కండువా ఉండడం కూడా చర్చకు దారి తీసింది. జనసేన, తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించే ఇలా చేశారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో నడిచింది. ఐతే నమ్రతా షేర్ చేసిన వీడియో చూసిన ఫ్యాన్స్.. ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చింది ఊహించేసుకుంటున్నారు. జగన్‌కి, మహేష్ ఫ్యామిలీ పూర్తి సపోర్ట్ ఇస్తున్నట్లుగా వీడియో ఉంది అని కొందరు అంటుంటే.. వచ్చే ఎన్నికలలో జగన్‌కే మద్దతు అన్నట్లుగా నమ్రత హింట్ ఇచ్చిందా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కృష్ణ ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది. కృష్ణ ఫ్యామిలీ కూడా మొదటి నుంచి వైసీపీ ఫేవర్‌గానే ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి కృష్ణ ఎంపీగా కూడా గెలిచారు.