Namratha Tweet: పచ్చదనంతో మహిళా దినోత్సవం జరుపుకుందాం..!
గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమాన్ని అప్పట్లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఏర్పాటు చేశారు. దీనికి చాలా మంది ప్రముఖుల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యమంత్రులు మొదలు ఎమ్మెల్యేల వరకూ, అగ్ర హీరోలు మొదలు చిన్న చిన్న కథానాయికలు వరకూ అందరూ ఇందులో భాగస్వామ్యం అయ్యారు. దీనిని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశ్యంతో తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒక ట్వీట్ చేశారు.

namratha planting tree
ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ సంకల్పించి మొక్కలు నాటండి అని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత అని తెలిపారు. ఉమెన్స్ డేని పురస్కరించుకొని తనను ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఎటు చూసినా కాలుష్యమే. ఈ కాలుష్యం కారణంగా మన జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దీనిని అధిగమించాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గం అని తెలుపుతున్నారు పర్యావరణ పరిరక్షణ నిపుణులు.
దీనికారణంగానే ప్రభుత్వాలు కూడా ఒకడుగు ముందుకు వేసి హరితహారం వంటి పేరుతో ప్రతిఏటా కొన్ని లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దీని కారణంగా సిటీలో వెలువడే పోల్యూషన్ కొంత వరకూ తగ్గే అవకాశం ఉంటుంది. మెట్రోనగరాల్లో పర్యవరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి జనాభా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వాహనాలు నడిపే వారి సంఖ్య కూడా అధిక సంఖ్యలో ఉంటుందని చెప్పాలి. కేవలం మన హైదరాబాద్ నగరంలోనే 80లక్షల వాహనాలు ఉన్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. రోజుకు 60లక్షల వాహనాలు రోడ్డుపైకి వస్తూ ఉంటాయట. అందులోని కర్భన పొగ పర్యావరణాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. అందుకే ఇలా చేయడం వల్ల కొంతవరకైనా ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతాం.
View this post on Instagram
కేవలం మహిళా దినోత్సవం ఒక్కరోజే కాకుండా ప్రతి రోజూ ఎవరో ఒక్కరు ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. అలాగే సమయం ఉన్నప్పుడల్లా ప్రకృతి ఒడిలో విహరించేందుకు ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ ప్రేమికులుగా మారాలి. అప్పుడే మన పరిసరాల్లో మంచి గాలిని పీల్చుకోగలం. తద్వారా ఎక్కవ ఆయుర్థాయాన్ని పొందగలం.
T.V.SRIKAR