అబ్బాయి రికార్డ్ కు బాబాయ్ ఎయిమ్… టెక్సాస్ లో బాలయ్య
అమెరికా కెనడాలలో దేవర క్రియేట్ చేసిన రికార్డుల గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదు. అప్పటి వరకు ఏ టాలీవుడ్ స్టార్ హీరో గాని బాలీవుడ్ హీరో గాని ఆ రేంజ్ లో ప్రీ బుకింగ్ మార్కెట్ పై ఫోకస్ చేయలేదు... అసలు ప్రీ బుకింగ్ మార్కెట్ అలా జరగలేదు కూడా.
అమెరికా కెనడాలలో దేవర క్రియేట్ చేసిన రికార్డుల గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదు. అప్పటి వరకు ఏ టాలీవుడ్ స్టార్ హీరో గాని బాలీవుడ్ హీరో గాని ఆ రేంజ్ లో ప్రీ బుకింగ్ మార్కెట్ పై ఫోకస్ చేయలేదు… అసలు ప్రీ బుకింగ్ మార్కెట్ అలా జరగలేదు కూడా. సినిమా విషయంలో ఎన్టీఆర్ ఏ లెక్కతో ఉన్నా సరే ప్రీ బుకింగ్ మార్కెట్ తో ఆ లెక్కలకు మంచి జోష్ వచ్చింది. ఆ ప్రభావం టోటల్ సినిమాపై పడింది. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ పై ఫోకస్ పెరగడానికి దేవర ట్రాక్ బిల్డ్ చేసింది.
గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేయడానికి ఇదే రీజన్ అంటున్నారు ట్రేడ్ పండితులు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ప్రీ బుకింగ్ మార్కెట్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు. దేవరను టార్గెట్ చేసారు కాబట్టి… కచ్చితంగా ప్రీ బుకింగ్ మార్కెట్ లో దూసుకు పోవాల్సిందే. ఇప్పుడు పుష్ప 2 కూడా ప్రీ బుకింగ్ మార్కెట్ పై సీరియస్ గా ఫోకస్ చేసింది. అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 కు ఈ మార్కెట్ రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ క్లియర్ గా కనపడుతోంది.
మెగా హీరోల వరకే… ఇప్పుడు ఆ టార్గెట్ తలనొప్పి కాలేదు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పుడు అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ పై ఫోకస్ చేసారు. బాబీ కొల్లి డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న డాకూ మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా విషయంలో బాలయ్య చాలా సీరియస్ గా ఉన్నట్టు టాక్. అమెరికాలో ప్రమోట్ చేయడానికి ఆయన రెడీ అయ్యారు. అమెరికాలో బాలయ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీ కార్యకర్తలు అమెరికాలో ఎక్కువ.
వాళ్ళు అందరూ దాదాపుగా బాలయ్య సినిమాను చూస్తారు. అన్ స్టాపబుల్ షో తర్వాత ఇతర హీరోల్లో కూడా బాలయ్యకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఇప్పుడు సినిమా ప్రమోషన్ పై ఆయన సీరియస్ గా ఫోకస్ పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. డిసెంబర్ లో బాలయ్య అక్కడ ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. డాకూ మహారాజ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. సో… ప్రమోట్ చేస్తే… అక్కడే ట్రైలర్ రిలీజ్ చేస్తే కచ్చితంగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. అఖండ సినిమా తర్వాత ఇతర భాషల్లో కూడా బాలయ్యకు ఫాలోయింగ్ పెరిగింది. సో… డాకూ మహారాజ్ మార్కెట్ కు ఇది ప్లస్ అవుతుంది. టెక్సాస్ ఈవెంట్ సక్సెస్ అయితే ఓవర్సీస్ లో వేరే కంట్రీస్ పై కూడా ఈ ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది.