Nandamuri Balakrishna: నరసింహ నాయుడు రీ-రిలీజ్.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా..
ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆల్ టైం హిట్ నరసింహ నాయుడు సినిమాను రి-రిలీజ్ చేశారు. ఆ రోజుల్లో ఈ సినిమా క్రియేట్ చేసినా రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఏకంగా 100 రోజులు థియేటర్స్‌ను హౌజ్‌ఫుల్ చేసింది.

Nandamuri Balakrishna: తెలుగు సినిమా రీజియన్‌లో ఇప్పుడు రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలను వాళ్ల పుట్టిన రోజు సందర్భంగా రి-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆల్ టైం హిట్ నరసింహ నాయుడు సినిమాను రి-రిలీజ్ చేశారు.
ఆ రోజుల్లో ఈ సినిమా క్రియేట్ చేసినా రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఏకంగా 100 రోజులు థియేటర్స్‌ను హౌజ్‌ఫుల్ చేసింది. ఇక స్క్రీన్ మీద బాలయ్య డాన్స్‌లు ఫైట్‌లకు ఆడియన్స్ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ముఖ్యంగా “కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా” అనే డైలాగ్‌ను తెలుగు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పట్లో నరసింహనాయుడు సినిమా ఆడియన్స్‌లో ఎక్కించిన కిక్ అలాంటిది. అలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను బాలయ్య బర్త్‌డేకు రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేస్తారో సెపరేట్‌గా చెప్పనక్కర్లేదుగా. థియేటర్స్ ముందు జాతర నిర్వహించినట్టు వేడుక చేశారు. టపాసులు పేలుస్తూ బ్యాండ్ వాయిస్తూ.. ఇదే సినిమా మొదటి సారి రిలీజ్ కావడం అన్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక థియేటర్‌లోపల బాలయ్య సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఏజ్‌ను మర్చిపోయి చిన్నా పెద్దా తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేశారు. బాలయ్య హీరోగా వస్తున్న బగవంత్ కేసరి టైటిల్ ఎనౌన్స్ చేయడమే కాకుండా నరసింహ నాయుడు రి-రిలీజ్‌తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ దొరికినట్టైంది.