Nandamuri Balakrishna: భగవంత్‌ కేసరి.. వీడికి వీడేలే సరి.. టీజర్‌ అదిరిపోయింది..

బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఇవాళ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఒక నిమిషం 24 సెకన్లు ఉన్న ఈ టీజర్‌లో బాలయ్య పవర్‌ ప్యాక్డ్‌ పర్ఫార్మెన్స్‌ను చూపించారు. అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి అంటూ బాలయ్య చేప్పిన డైలాగ్‌కు ఆడియన్స్‌ ఊగిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 10, 2023 | 11:48 AMLast Updated on: Jun 10, 2023 | 11:48 AM

Nandamuri Balakrishnas Bhagavathkesari Teaser Released Today

Nandamuri Balakrishna: బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భవగవంత్‌ కేసరి సినిమా టీజర్‌ రిలీజైంది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఇవాళ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఒక నిమిషం 24 సెకన్లు ఉన్న ఈ టీజర్‌లో బాలయ్య పవర్‌ ప్యాక్డ్‌ పర్ఫార్మెన్స్‌ను చూపించారు.

అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి అంటూ బాలయ్య చేప్పిన డైలాగ్‌కు ఆడియన్స్‌ ఊగిపోయారు. టీజర్‌ను బట్టి చూస్తుంటే ఓ పెద్ద బిజినెస్‌ మ్యాన్‌కు, ఓ సాధారణ కార్మికుడికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమాగా తెలుస్తోంది. టీజర్‌లో బాలయ్యతో పాటు విలన్‌ను కూడా గ్రాండ్‌గా చూపించారు. జస్ట్‌ వన్‌ మినట్‌లోనే సినిమాలో యాక్షన్‌ ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూపించారు. ఇక భగవంత్‌ కేసరి అంటూ వచ్యిన బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. సాంగ్‌ విషయంలో థమన్‌ ఇరగదీశాడు. ఈ టీజర్‌ ఎండింగ్‌లో బాలయ్య చేతిలో బ్యాట్‌ను గిటార్‌లా పట్టుకుని బస్‌లో ప్రయాణికులతో సరదాగా డాన్స్‌ చేస్తూ కనిపించాడు. సినిమాలో యాక్షన్స్‌ సీక్వెన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో కామెడీ, ఎంటర్టైన్‌మెంట్‌ కూడా అదే రేంజ్‌లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తాన్ని హైలెట్‌ బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడటం.

మొదటి సారిగా తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడబతోఉన్నాడు బాలయ్య. ఈ మధ్య తెలంగాణ యాసతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‌బస్టర్లుగా నిలిస్తున్నాయి. దీంతో ఇప్పుడు బాలయ్య కూడా ఇదే రూట్‌లో వస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు మాస్‌ మూవీలో తెలంగాణ స్లాంగ్‌ పెట్టడం సినిమాకు ప్లస్‌ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ప్రతినిధిగా ఉండే అనిల్‌ రావిపూడి మొదటిసారిగా మాస్‌ యాక్షన్‌ సినిమా.. అది కూడా బాలయ్యతో ట్రై చేశాడు. ప్రస్తుతం వచ్చిన టీజర్‌కు మాత్రం ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇక దసరాకు సినిమా రిలీజ్‌ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి.