Nandamuri Balakrishna: సింహం, నక్కల వేట విత్ మాన్షన్ హౌస్.. బాలయ్య గ్లింప్స్ చూస్తే.. మీకు శివరాత్రే..
గ్లింప్స్ మాత్రం చాలా రిచ్‌గా కనిపించింది. బాలయ్య నుంచి ఎలాంటివి ఆశిస్తున్నారో.. ఎలాంటి సీన్లు ఉంటాయని ఊహించుకుంటున్నారో మీ ఇష్టం.. అన్నీ ఇవ్వడానికి, అంతా ఇవ్వడానికి మేమొస్తున్నాం అన్నట్లు బాలయ్య స్టైలిష్ లుక్‌తో డైరెక్టర్ బాబీ వదిలిన గ్లింప్స్‌కు ఆడియెన్స్ ఫిదా అంటున్నారు.
Nandamuri Balakrishna: రాజకీయాల్లో ఉండి.. సినిమాల్లో యాక్ట్ చేసే నటులు ఏం చేసినా.. రాజకీయమే వినిపిస్తుంది. నందమూరి హీరోలు చెప్పే డైలాగులు అయితే.. పొలిటికల్ ఫ్లేవర్‌లోనే ఉంటాయ్. ఎన్నికల టైమ్‌లో వచ్చి.. బాక్సాఫీస్ రికార్డులు ఎగరేసుకుపోవడం బాలయ్యకు కొత్తేం కాదు. ఇప్పుడు అలానే రాబోతున్నాడు. ఐతే ఈసారి ఇంకాస్త వైల్డ్‌గా ! ఓ బాక్స్.. ఓపెన్ చేస్తే మాన్షన్ హౌజ్ ఫుల్ బాటిల్.. బాలయ్య వేటాడే వేట.. లావాతో ఓపెన్ చేసి.. అదే వేడిని టీజర్ మొత్తం కంటిన్యూ చేశాడు డైరెక్టర్ బాబీ.
KALKI 2898 AD: కల్కిలో ప్రభాస్ పాత్ర పేరెంటో తెలుసా..? కొత్త పోస్టర్ రిలీజ్
సింహం నక్కల మీదకు వస్తే వార్ అవదురా లఫూట్.. వేట అంటూ బాలయ్య చెప్పే డైలాగులకు గూస్‌బంప్స్ అంతే ! బాలకృష్ణ నుంచి సినిమా వస్తోంది అంటే మాస్ ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో బాలకృష్ణ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి ఊచకోత కాన్సెప్ట్‌తో NBK 109 రాబోతోంది. తాజాగా వచ్చిన గ్లింప్స్ చూస్తే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా రిలీజైన గ్లింప్స్‌లో బాలయ్య శివతాండవం ఆడాడు. మొదట ఓ డ్యామ్ నుంచి నిప్పుల కొలిమి వస్తూ NBK పేరుని తడిపేసింది. ఈ తర్వాత అడవిలో రాజుకున్న కారిచ్చులో బాలయ్య ఒక పెట్టెలో కత్తులు, కటారులు ఉన్న ఆయుధాల పెట్టెతో ఎంట్రీ ఇచ్చాడు.
కత్తులు తీసి నరికితే ఉంటుందీ.. స్కీన్ మీద శివతాండవంలా అనిపించింది. ఒకడి గుండెలపై కాలు పెట్టి.. ఇంకొకడి మెడల చుట్టూ కత్తులు చుట్టి.. రెండు కళ్లు చాలవ్ ఆ ఫ్రేమ్ చూడాలంటే ! ఇదే సీన్ బిగ్‌స్క్రీన్ మీద ఉంటే.. విజిల్స్ ఖాయం. గ్లింప్స్ మాత్రం చాలా రిచ్‌గా కనిపించింది. బాలయ్య నుంచి ఎలాంటివి ఆశిస్తున్నారో.. ఎలాంటి సీన్లు ఉంటాయని ఊహించుకుంటున్నారో మీ ఇష్టం.. అన్నీ ఇవ్వడానికి, అంతా ఇవ్వడానికి మేమొస్తున్నాం అన్నట్లు బాలయ్య స్టైలిష్ లుక్‌తో డైరెక్టర్ బాబీ వదిలిన గ్లింప్స్‌కు ఆడియెన్స్ ఫిదా అంటున్నారు. ఇక బాలయ్య పేరు చెప్తే పూనకం వచ్చినట్లు ఊగిపోయే థమన్.. మరోసారి అలాంటి మ్యూజిక్కే ఇచ్చాడు. ఓవరాల్‌గా గ్లింప్స్.. క్యూరియాసిటీ మరింత పెంచింది.