Nandamuri Balakrishna: గొడ్డలితో బాలయ్య.. బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్.. వయొలెన్స్ కా విజిటింగ్ కార్డ్..
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబీ (director bobby)తో కలిసి యాక్షన్‌లో దిగుతున్నాడు. ఎన్బీకె 109 (NBK 109) వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమా.. రెగ్యూలర్ షూటింగ్‌కు రెడీ అయిపోయింది.

Nandamuri Balakrishna: భగవంత్ కేసరి సౌండ్ ఇంకా థియేటర్లో వినిపిస్తూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర రూ.140 కోట్ల గ్రాస్ రాబట్టిన భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్స్ ఈ నెల 9న గ్రాండ్‌గా జరగనున్నాయి. ఇక ఈ సినిమా థియేటర్ క్లోజింగ్ టైం వచ్చేసింది కాబట్టి.. నెక్స్ట్ సినిమా యాక్షన్‌కు రెడీ అయిపోయారు నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna). అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబీ (director bobby)తో కలిసి యాక్షన్‌లో దిగుతున్నాడు.
Devara: భయానికి మరో కొత్త పేరు దేవర.. 150 రోజుల్లో ఊచకోత
ఎన్బీకె 109 (NBK 109) వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమా.. రెగ్యూలర్ షూటింగ్‌కు రెడీ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్‌ను భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఎన్బీకె 109 షూటింగ్ స్టార్ట్ అయిందని తెలిపారు మేకర్స్. గొడ్డలికి ఓ కళ్లజోడును తగిలించి.. అందులో ఎగిరిపడుతున్న విలన్లను చూపించారు మేకర్స్. ఇక.. అదే గొడ్డలికి ఓ లాకెట్ కూడా ఉంది. అంతేకాకుండా బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ వీర లెవల్ ఎలివేషన్‌తో ఆ పోస్టర్‌కు బాబీ క్యాప్షన్ జోడించారు. ఇక లేటెస్ట్ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేసినట్టు సమాచారం. ఈ సెట్‌లో బాలయ్య ఎంట్రీ సీన్స్‌తో పాటు.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేయనున్నారట.
PRABHAS: సలార్ ఈజ్ బ్యాక్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ప్రభాస్..!
ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. పోస్టర్ చూస్తుంటే పవర్‌ఫుల్ రోల్‌లో బాలయ్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రక్తపాతం ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. ఇక గొడ్డలిని చూస్తుంటే విధ్వంసానికి రెడీ అయినట్టుగానే కనిపిస్తోంది.