“నందమూరి తమన్” కు నందమూరి బాలయ్య భారీ గిఫ్ట్.. కాస్ట్ ఎంతంటే…?

ఆఖండ సినిమా తర్వాత నుంచి తన సినిమాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో నందమూరి బాలకృష్ణ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గతంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాలయ్య సినిమాల కోసం ఈ స్థాయిలో కష్టపడలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2025 | 01:10 PMLast Updated on: Jan 16, 2025 | 1:10 PM

Nandamuri Balayyas Huge Gift To Thaman

ఆఖండ సినిమా తర్వాత నుంచి తన సినిమాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో నందమూరి బాలకృష్ణ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గతంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాలయ్య సినిమాల కోసం ఈ స్థాయిలో కష్టపడలేదు. సినిమా సినిమాకు తనలో ఉన్న మ్యూజిక్స్ స్కిల్స్ అన్ని తమన్ బయటపెడుతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలకు తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాకు కూడా థియేటర్లు బద్దలయ్యే రేంజ్ లో మ్యూజిక్ కొట్టాడు తమన్.

ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంలో తమన్ కూడా కీ రోల్ ప్లే చేశాడు. ఎలివేషన్స్ సీన్స్ అలాగే యాక్షన్ సీన్స్ లో బాలయ్య కోసం తనలో ఉన్న మ్యూజిక్ లైబ్రరీ మొత్తాన్ని బయటికి లాగాడు. దీనితో కొన్నిచోట్ల స్పీకర్లు కూడా కాలిపోయిన పరిస్థితి. సినిమా రిలీజ్ కి ముందే తమన్ విషయాన్ని క్లారిటీగా చెప్పాడు. ఖచ్చితంగా కొత్త స్పీకర్లు కొని పెట్టుకోవాలని… బాలకృష్ణ సినిమా అంటే అలాగే ఉంటుందని… ఆ విషయంలో తాను ఏమీ చేయలేను అంటూ కూడా క్లియర్ కట్ గా చెప్పేసాడు.

దీంతో నార్మల్ ఆడియన్స్ కూడా బాలయ్య సినిమా అంటే తమన్ మ్యూజిక్ కోసం ఎదురుచూసే పరిస్థితి. అలాంటి తమన్ కోసం బాలయ్య భారీ గిఫ్ట్ ఇస్తున్నారు. దాదాపు 40 లక్షలు విలువచేసే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ను బాలయ్య సంక్రాంతి కానుకగా తమన్ కు అందించారు. బాలకృష్ణకు ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో కూడా తమన్ వర్క్ చేయనున్నాడు. అఖండ సీక్వెల్ కోసం ఇప్పటికే తమన్ వర్క్ కూడా మొదలుపెట్టేసాడు. అఖండ పార్ట్ 1 కు మించి ఈ సినిమాలో మ్యూజిక్ ఉండే ఛాన్స్ ఉంది.

అందుకే… డైరెక్టర్ బోయపాటి కూడా ఎలివేషన్స్ సీన్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అఖండ పార్ట్ 1 రేంజ్ లో మరీ హడావుడి లేకపోయినా కొన్ని సీన్స్ విషయంలో క్లాస్ ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. సంక్రాంతి గ్యాప్ లేకుండా అఖండ సీక్వెల్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఉత్తరప్రదేశ్ లో మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేశాడు. శివుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమా కావడంతో మహాకుంభమేళా ఈ సినిమా షూటింగ్ కు మంచి ప్లేస్ అని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అందుకే షూటింగ్ విషయంలో ఏమాత్రం లేట్ చేయకుండా సంక్రాంతిని కూడా పక్కనపెట్టి వెళ్ళిపోయారు మేకర్స్. దసరా తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.