మెగాను ఆడుకుంటున్న నందమూరి ఫ్యాన్స్.. అడ్డంగా దొరికారా…?

సాధారణంగా సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ ఎక్కువగా ట్రోల్ చేసేది నందమూరి బాలకృష్ణను. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా సరే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంటారు జనాలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 04:35 PMLast Updated on: Feb 13, 2025 | 4:35 PM

Nandamuri Fans Troll To Mega Fans

సాధారణంగా సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ ఎక్కువగా ట్రోల్ చేసేది నందమూరి బాలకృష్ణను. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా సరే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంటారు జనాలు. ఇక బాలకృష్ణ కూడా అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటారు. బహిరంగ వేదికలపై బాలకృష్ణ మాట్లాడే మాటలకు మెగా ఫ్యామిలీ అభిమానులు కాస్త హడావుడి ఎక్కువగానే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తో నందమూరి ఫ్యాన్స్ చిరంజీవిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.

రామ్ చరణ్ కు కొడుకు పుట్టాలని.. అలాగే కూతురు పుడుతుందేమోనని భయం తనలో ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఒక్కసారిగా దుమారం వేపుతున్నాయి. ఈ కామెంట్స్ ను నందమూరి ఫ్యాన్స్ గట్టిగానే షేర్ చేస్తున్నారు. ఇక చిరంజీవి ఒక బూతు కూడా మాట్లాడారు. మీమ్స్ గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సాధారణంగా వేదికలపై చిరంజీవి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన మాత్రం నోరు జారడంతో నందమూరి అభిమానులు ఆ వీడియోలను గట్టిగా వైరల్ చేస్తున్నారు.

చిరంజీవి ఆ స్థాయిలో ఉండి అలా మాట్లాడటాన్ని.. మెగా అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు నందమూరి హీరోలను ట్రోల్ చేసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు చిరంజీవిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో బాలకృష్ణ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక మెగా ఫాన్స్ అయితే ఇటీవల కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు. వాళ్లు ట్రోల్ చేసిన ప్రతి హీరో సినిమా హిట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాను మెగా ఫాన్స్ గట్టిగా ట్రోల్ చేయగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమాను కూడా మెగా ఫాన్స్ టార్గెట్ చేశారు. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. ఇక బాలకృష్ణ.. డాకు మహారాజ్ సినిమాని కూడా ట్రోల్ చేశారు మెగా ఫాన్స్. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో వాళ్లు సైలెంట్ అయిపోయారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం ఈ మధ్య పెద్దగా హిట్ అవ్వడం లేదు. రాం చరణ్ సినిమాలు త్రిబుల్ ఆర్ తర్వాత.. ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు. ఇక చిరంజీవి చేసే సినిమాపై కూడా అభిమానులకు నమ్మకాల్లేవు. ఇక వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన మట్కా సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా మెగా ఫాన్స్ ను.. అందరూ హీరోల ఫ్యాన్స్ ఓ ఆట ఆటాడుతున్నారు. అనవసరంగా వేరే హీరోలను ట్రోల్ చేసే ముందు మీ హీరోల సంగతి చూసుకోవాలని.. మీ హీరోలు హిట్ కొట్టాలని.. అలాగే బహిరంగ వేదికలపై మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిదని సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు నందమూరి ఫ్యాన్స్.