balayya : బాలయ్య ఫ్యాన్స్‌కు దబిడి దిబిడే
వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Natasimha Balakrishna).. ప్రస్తుతం ఆయన యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు.. NBK 109 గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Nandamuri Natasimha Balakrishna is a big hit for fans
వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Natasimha Balakrishna).. ప్రస్తుతం ఆయన యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు.. NBK 109 గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ని.. సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertainments), శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని రానున్న దసరా బరిలో నిలిపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భగవంత్ కేసరి లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
కాగా.. ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే మరొక సినిమాను లైన్‌లో పెట్టడం బాలయ్యకు అలవాటు.. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ.. బోయపాటి శ్రీను తో అఖండ 2 (Akhanda2)మూవీ కూడా బాలకృష్ణ అతి త్వరలో చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుందని టాక్.. ఇక వీటితో పాటు తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ స్టోరీకి బాలకృష్ణ పచ్చజండా ఒప్పారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. దాని ప్రకారం ఇటీవల నానితో శ్యామ సింగ రాయ్ వంటి సక్సెస్ఫుల్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ మూవీ చేయనున్నాడట.. ఒక పెద్ద నిర్మాణ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ ప్రాజక్ట్ గురించి అతి త్వరలో అనౌన్స్‌మెంట్ రానుందట..
ఇలా బాలయ్య వరుసగా యంగ్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక.. బాలయ్య బాబు ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంటున్నాడు. అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి (Bhagwant Kesari) సినిమాలతో హ్యాట్రిక్ కొట్డాడు.. రీసెంట్‌గా ఇక భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య సూపర్ హిట్టును అందుకున్నాడు. ఈ సినిమాతో బాలయ్య రేంజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమా వెండితెరపైనే కాదు… బుల్లితెరపై కూడా రచ్చలేపే రేటింగ్ సాధించింది. దీంతో.. బాలయ్య నుంచి రాబోతున్న నెక్ట్స్ మూవీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.