నందమూరికి హ్యాండ్ ఇచ్చాడు.. రెబల్ స్టార్ తో లుక్ టెస్ట్ కు రెడీ

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తాడనేది ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్ లో పడింది. లాస్ట్ ఇయర్ సినిమాను అనౌన్స్ చేసినా.. ఆ సినిమా ఇప్పటివరకు ముందుకు వెళ్లే సిగ్నల్ ఎక్కడా కనపడటం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 05:20 PMLast Updated on: Feb 27, 2025 | 5:20 PM

Nandamuris Successor Mokshajna Will Make His Film Entry Is Again In Suspense

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తాడనేది ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్ లో పడింది. లాస్ట్ ఇయర్ సినిమాను అనౌన్స్ చేసినా.. ఆ సినిమా ఇప్పటివరకు ముందుకు వెళ్లే సిగ్నల్ ఎక్కడా కనపడటం లేదు. డిసెంబర్లో వెళుతుందని.. కొంతమంది జనవరిలో వెళ్తుందని మరి కొంతమంది.. కాదు ఫిబ్రవరిలో అని ఇంకొంత మంది కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటివరకు అసలు ఆ సినిమా ఏమైందో కూడా ఎవరికి తెలియదు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాని ఏం చేశాడో కూడా ఎవరికి క్లారిటీ రావడం లేదు.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం పని చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటి వరకు అనుకున్నాయి. ఇక మోక్షజ్ఞ కూడా ఈ సినిమా కోసం గట్టిగా రెడీ అయ్యారని.. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ని కూడా కొంతమందిని తీసుకుంటున్నారని.. అలాగే ఒక తెలుగు స్టార్ హీరో కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందని టాక్ నడిచింది. హనుమాన్ సినిమాతో దాని ఏంటి అనేది.. ప్రశాంత్ వర్మ ప్రూవ్ చేసుకోవడంతో కచ్చితంగా అతనిపై బాలకృష్ణ భారీగా నమ్మకం పెట్టుకున్నారు.

అందుకే పెట్టుబడి విషయంలో ఎక్కడ వెనకడుగు వేయటం లేదని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ ఊహించని షాక్ ఇచ్చాడు. మోక్షజ్ఞతో సినిమాను ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రశాంత్ వర్మ వెనకడుగు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాను పక్కన పెట్టేసి మరో భారీ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నట్లు సిగ్నల్స్ వచ్చేసాయి. లేటెస్ట్ గా వచ్చిన ఒక అప్డేట్ నందమూరి అభిమానుల్లో బీపీ పెంచుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమాను ఫైనల్ చేసుకుని, లుక్ టెస్ట్ కూడా చేయించడానికి రెడీ అయిపోయాడు ప్రశాంత్ వర్మ.

దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాదులో ఒక చిన్న పాటి సెట్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రామానాయుడు స్టూడియోలో దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ ఉండే ఛాన్స్ ఉందని, అక్కడే ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో ఒక వీడియో కూడా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో చేయాల్సిన బ్రహ్మ రాక్షస్ అనే సినిమాను ఇప్పుడు ప్రభాస్ తో చేయడానికి ప్రశాంత్ వర్మ రెడీ అయ్యాడు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఈ కథను మార్పులు చేర్పులు చేశాడు. దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే సినిమాకు నిర్మాణ సంస్థ కూడా ఫైనల్ అయిపోయింది. ప్రభాస్ తో మూడు సినిమాలు చేస్తున్న హోంబలే ఫిలిమ్స్ ఇప్పుడు ఈ సినిమాను కూడా చేసేందుకు రెడీ అయింది. దీనితో నందమూరి మోక్షజ్ఞ సినిమాను ప్రశాంత్ వర్మ ఆల్మోస్ట్ పక్కన పెట్టేసినట్లే అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.