Nandini Reddy: అన్నీ మంచి శకునములే.. ఫుల్ మూవీ రివ్యూ..
క్లాసిక్ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్‌లో స్వప్న సినిమాస్ బ్యానర్‌లో వచ్చిన అన్నీ మంచి శకునాలే సినిమా ఇవాళ రిలీజైంది.
బ్రిటీష్ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన కాఫీ తోటలు, కంపెనీకి సంబంధించి వారసత్వంగా వచ్చే ఆస్తుల విషయంలో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కోర్టుకు ఎక్కుతారు. ఇదిలా ఉంటే “అల వైకుంఠపురములో” టైపులో ఈ రెండు కుటుంబాల్లోనూ ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు పిల్లలు తారుమారవుతారు. ఒకళ్లు పెరగాల్సిన చోట మరొకరు పెరుగుతారు. వాళ్లిద్దరూ పెద్దయ్యి హీరో హీరోయిన్లవుతారు. చిన్నప్పటి నుంచే హీరోయిన్ ఆర్య అంటే హీరో రిషికి ప్రాణం. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా పెరిగిన వారిద్దరూ ఇటలీ ట్రిప్ వెళ్తారు. అక్కడ చిన్న ఇష్యూ కారణంగా రిషి, ఆర్య మధ్య బ్రేకప్ జరుగుతుంది.
30 ఏళ్లకుపైగా కోర్టులో కొనసాగుతున్న కాఫీ తోటల వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది. రిషి, ఆర్య పుట్టుక మధ్య కథలో చోటు చేసుకొన్న ట్విస్ట్ ఏమిటి? ఆర్య, రిషి ఎందుకు విడిపోయారు? ఆర్య చేసే పనులు తండ్రికి ఎందుకు నచ్చవు? ఆర్య, తండ్రి ప్రసాద్ మధ్య విభేదాలకు కారణాలు ఏమిటి? చివరకు ఆర్య, రిషి ప్రేమకు ఎలాంటి ముగింపు లభించిందనేది మిగిలిన కథ. సినిమాలో కొత్తదనం గానీ, ఎమోషనల్ పాయింట్స్ కానీ పెద్దగా లేవు. సినిమా మొత్తం మీద క్లైమాక్స్ తప్పితే.. మిగితాదంతా రొటీన్, రెగ్యులర్ కథలా అనిపిస్తుంది.
ఇక స్క్రీన్‌ప్లే కూడా అంతంతమాత్రంగానే ఉంది. చాలా రోల్స్ సీనియర్స్‌తో చేయించినా వాటిని సరిగ్గా డిజైన్ చేయడంలో డైరెక్టర్ నందిని ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. హీరో శోభన్ మాత్రం తన రోల్‌కు న్యాయం చేశాడు. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ శోభన్‌కు మంచి కథలు పడటంలేదని ఈ సినిమాతో క్లియర్ అయింది. టెక్నికల్ విషయానికొస్తే ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రం కొన్ని సీన్లను చాలా ఎలివేట్ చేసింది. అయితే సాంగ్స్ పిక్చరైజేషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఎమోషన్స్ పండించేందుకు చాన్స్ ఉన్నా ఎక్కడా వాటిని యూజ్ చేసుకోలేదు. కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమీ లేకపోవడతంతో సినిమా చాలా స్లోగా సాగడమే కాకుండా సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించాలనే మంచి ప్రయత్నం మిస్ ఫైర్ అయిందని చెప్పవచ్చు.