Nani: అలాంటి డైరెక్టర్‌ ఉండటం మన దురదృష్టం.. వెంకటేష్‌ మహాకు కౌంటర్‌ ఇచ్చిన నాని

రీసెంట్‌గా కేజీఎఫ్‌ సినిమా గురించి కామెంట్స్‌ చేసి విమర్శలు ఎదుర్కున్న వెంకటేష్ మహా ఇష్యూపై నేచురల్‌ స్టార్‌ నాని స్పందించాడు. దసరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్‌ మహా గురించి నాని కొన్ని కామెంట్స్‌ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2023 | 05:54 PMLast Updated on: Mar 17, 2023 | 5:54 PM

Nani Comments On Venkatesh Maha

రీసెంట్‌గా కేజీఎఫ్‌ సినిమా గురించి కామెంట్స్‌ చేసి విమర్శలు ఎదుర్కున్న వెంకటేష్ మహా ఇష్యూపై నేచురల్‌ స్టార్‌ నాని స్పందించాడు. దసరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్‌ మహా గురించి నాని కొన్ని కామెంట్స్‌ చేశాడు. సినిమా గురించి ఫ్రెండ్స్‌తో మాట్లాడుకున్నంత సింపుల్‌గా ఇంటర్వ్యూలో మట్లాడటం తప్పంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ప్రతీ సినిమాపై ఒక్కో వ్యక్తికి ఒక్కో ఒపీనియన్‌ ఉంటుందని.. కానీ దాన్ని బయటికి చెప్పే విదానంలో తేడా ఉంటుందన్నాడు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకుడు కూడా కాస్త ఫార్మల్‌గా మాట్లాడుతాడు.. కానీ వెంకటేష్‌ మహా తాను ఇంటర్వ్యూలో ఉన్నానన్న విషయం మర్చిపోయి ఇలాంటి కామెంట్స్‌ చేయడం సరికాదన్నారు. ఒక డైరెక్టర్‌ అయిఉండి సినిమా వెనక ఉన్న కష్టం మర్చిపోయి మట్లాడటం కరెక్ట్‌ కాదంటూ వెంకటేష్‌కు చురకలు అంటించాడు. ఇంటర్వ్యూ సమయంలో వెంకటేష్‌తో ఉన్న కొందరు డైరెక్టర్స్‌తో తాను గతంలో పని చేశానని చెప్పాడు నాని. వాళ్లంతా కమర్షియల్‌, యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవాళ్లేనని చెప్పాడు. సాధారణంగా ఓ వ్యక్తి జోక్‌ వేసినప్పుడు ఎవరైనా నవ్వడం కామన్‌.. అలాగే వాళ్లు కూడా నవ్వి ఉంటారు.. ఆ చిన్న క్లిప్పింగ్‌తో వాళ్ల క్యారెక్టర్‌ డిసైడ్‌ చెయ్యడం సరికాదని చెప్పాడు. దీనికి తోడు ఈ ఇష్యూపై చాలా మంది సినీ ప్రేమికులు, ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. దీంతో వెంకటేష్‌ మహా ఈ విషయం గురించి వివరణ ఇచ్చాడు. తానెందుకు అలా మట్లాడాడో చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని నాని మరోసారి గుర్తు చేశాడు. ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకున్న తరువాత మళ్లీ అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించడం సరికాదని చెప్పాడు. కాగా దసరా సినిమా ప్రమోషన్స్‌లో ప్రస్తుతం ఈ నేచురల్‌ స్టార్‌ చాలా బిజీగా గడుపుతున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌ వస్తున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.