Nani Dasara: తాగి షూటింగ్‌కు వచ్చిన నేచురల్‌ స్టార్‌ నాని

శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో.. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రూపొందిన మాస్‌ ఎంటర్టైనర్‌ దసరా.. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా స్టోరీ మొత్తం గోదావరిఖనిలోని సింగరేణి ప్రాంతంలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీబిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలోని తన క్యారెక్టర్‌ గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలు చెప్పాడు నాని.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 16, 2023 | 04:35 PMLast Updated on: Mar 16, 2023 | 4:36 PM

Nani Consumed Alcohol In Shooting

శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో.. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రూపొందిన మాస్‌ ఎంటర్టైనర్‌ దసరా.. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా స్టోరీ మొత్తం గోదావరిఖనిలోని సింగరేణి ప్రాంతంలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీబిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలోని తన క్యారెక్టర్‌ గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలు చెప్పాడు నాని. కొన్ని సీన్స్‌ నటించేందుకు తాను నిజంగానే అల్కహాల్‌ తీసుకున్నట్టు చెప్పాడు. సినిమా స్టోరీ విన్నప్పుడే తన క్యారెక్టర్ చాలా వైల్డ్‌గా అనిపించదని చెప్పాడు నాని. క్యారెక్టర్‌ కోసం తనను తాను ఫిజికల్‌గా, మెంటల్‌గా మార్చుకునేందుకు నానికి నాలుగు నెల్లు సమయం పట్టిందట. పూర్తిగా క్యారెక్టర్‌లో ఇన్వాల్స్‌ అయ్యాక కూడా కొన్ని సీన్స్‌ ఎమోషన్‌కు తగ్గట్టుగా రాలేదట. దీంతో నేచురల్‌గా వైల్డ్‌లుక్‌ కనిపించేందుకు మొదట కొన్ని సాఫ్ట్ డ్రింక్స్‌ తీసుకున్నాడట నాని. కానీ అప్పటికి కూడా లుక్‌ సెట్‌ అవ్వకపోవడంతో నిజంగానే ఆల్కహాల్‌ తీసుకున్నాడట. ట్రైలర్‌లో కనిపించిన సీన్స్‌లో ఆ లుక్‌ వచ్చేందుకు ఆల్కహాలే కారణమని చెప్పాడు నాని. మరోపక్క ఈ లుక్‌, యాటిట్యూడ్‌ పుష్ప సినిమా నుంచి కాపీ కొట్టారని కొన్ని రోజులు దసరా సినిమా మీద విమర్శలు వస్తున్నాయి. అయితే నాని ఈ విమర్శలను కొట్టి పారేశాడు. కాస్టూమ్‌ ఒకేలా ఉన్నా రెండు క్యారెక్టర్ల మధ్య చాలా తేడాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. దసరా సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు పుష్పరాజ్‌ పాత్రను మర్చిపోయి కేవలం ధరణి పాత్రను మాత్రమే గుర్తు పెట్టుకుంటారని చెప్పాడు.