Nani: దసరా..నాని ని గట్టెక్కిస్తుందా?
నానీ వరుస ఫ్లాపుల్లో వున్నా.. అప్‌కమింగ్ మూవీ దసరా హైప్‌తో రిలీజ్ అవుతోంది. హీరో కెరీర్‌లో ఇంతవరకు 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేకపోయినా... దసరా ప్రీ రిలీజ్ బిజినెస్సే 50 కోట్లు దాటిపోవడం షాక్ ఇస్తోంది. అందుకే దసరా పైనే నాని ఆశలన్నీ.
నాని కెరీర్‌లో ఎక్కువ బిజినెస్ జరుపుకుని.. హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ‘ఎంసిఎ’. థియేటరికల్ రైట్స్ 30 కోట్లకు అమ్ముడైతే.. 40 కోట్లు తీసుకొచ్చింది. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఆతర్వాత ఇంతవరకు 30 కోట్లు కలెక్ట్ చేయడమే గగనమైపోతోంది. ఇలాంటి సిట్యువేషన్‌లో దసరా థియేటరికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడయ్యాయి. దేవ దాసు 37 కోట్లకు బిజినెస్ అయినా..ఇందులో నాగార్జున కూడా వుండడంతో మల్టీస్టారర్ మూవీగా రిలీజైంది. అందుకే దేవ దాస్‌ను పక్కన పెడితే సోలో హీరోగా నటించిన సినిమాల్లో ఎంసిఎతోపాటు.. అంటే సుందరానికీ కూడా 30 కోట్లకు అమ్ముడైంది. అయితే.. వసూళ్లు 20 కోట్లు కూడా రాలేదు. మిగతా సినిమాలు గ్యాంగ్ లీడర్ 28 కోట్లు.. జెర్సీ 26 కోట్లకు బిజినెస్ జరుపుకుంది.
ఎప్పుడూ లేనిది నాని గడ్డు పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. నీట్‌గా.. లవర్‌బాయ్‌లా కనిపిస్తే.. ప్రయోజనం లేదనుకున్నాడో ఏమోగానీ.. దసరా మూవీ కోసం.. రఫ్‌గా తయారయ్యాడు. అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడల్లా ఇలా మేకోవర్ అవుతానని కలలో కూడా ఊహించివుండడు. షూటింగ్ టైంలో హీరో క్రేజ్‌కు మించిన బడ్జెట్‌తో సినిమా రూపొందుతుందని.. రిస్క్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. నాని దసరాలో పాన్‌ఇండియాలోకి అడుగుపెడుతున్నాడు. ఆడియో.. టీజర్.. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బడ్జెట్ 60 కోట్లయినా.. 70 కోట్లయినా.. థియేటరికల్ బిజినెస్ 50 కోట్లకు జరిగింది. దసరా సెట్స్‌పై వుండగానే… నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో 40 కోట్లు వచ్చాయని ప్రచారం జరిగింది. నాని క్రేజ్‌కు తగ్గ బడ్జెట్ కాదు.. రెగ్యులర్ బడ్జెట్‌కు రెండు రెట్లు ఎక్కువ. హీరోకు సరైన హిట్ లేకపోయినా..దసరా అన్ని భాషల శాటిలైట్.. ఓటీటీ.. డబ్బింగ్ .. థియేటరికల్ రైట్స్ కలుపుకుంటే.. 80..90 కోట్లు వుండొచ్చని అంచనా. మరి దసరా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.