Nani Film: దసరాకు 19 సెన్సార్‌ కట్స్‌ ఇక రచ్చ రంబోలానేనా..

నాని ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న దసరా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్‌ ఇచ్చింది. మొత్తం 19 కట్స్‌ పోగా 2 గంటల 39 నిమిషాల డ్యురేషన్‌తో సినిమా రీలిజ్‌ కానుంది. సెన్సార్‌ బోర్డ్‌ 19 కట్స్‌ చేసింది అంటే సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2023 | 07:00 AMLast Updated on: Mar 27, 2023 | 7:00 AM

Nani Film Dasara Ready To Release

ఈ సినిమాలో నాని ఊరమాస్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఫైట్‌ సీన్స్‌ కూడా భీకరంగానే ఉంటాయని డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల ముందుగానే చెప్పేశాడు. కొన్ని సీన్స్‌లో ఇంటెన్సివ్‌ లుక్‌ కోసం నిజంగానే ఆల్కహాల్‌ తీసుకుని యాక్టింగ్‌ చేసినట్టు నాని ఓ ఇంటర్వ్యలో చెప్పాడు. దీంతో ఆడియన్స్‌ ఓ అంచనాకు వచ్చేశారు. కానీ సెన్సార్‌ బోర్డ్‌ ఏకంగా 19 కట్స్‌ చేసింది. దీంతో హీరో, డైరెక్టర్‌ చెప్పిన వైల్డ్‌ సీన్స్‌ సినిమాలో ఉన్నాయా లేక వాటిని సెన్సార్‌ బోర్డ్ ఆపేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కోల్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కథ మొత్తం గోదావరిఖని దగ్గరి వీరపల్లిలో జరుగుతుంది.

సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ చూసినప్పుడు.. పుష్ప సినిమాను కాపీ కొట్టారు అని అంతా కామెంట్స్‌ చేశారు. కానీ హీరో నాని మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. ఈ సినిమా చూసిన తరువాత పుష్ప సినిమాను మర్చిపోతారంటూ చెప్పాడు. నిజానికి పుష్ప సినిమాకు కూడా సెన్సార్‌ బోర్డ్‌ ఇన్ని కట్స్‌ వేయలేదు. ఇప్పుడు దసరాకు 19 కట్స్‌ పెట్టడంతో నిజంగానే ఈ సినిమా పుష్పను క్రాస్‌ చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీకాంత్‌ ఓదెల డెబ్యూ ఫిలింగా వస్తున్న దసరా.. ఈ నెల 30న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. బుకింగ్స్‌ కూడా ఓపెన్‌ అయినట్టు మూవీ టీం ఎనౌన్స్‌ చేసింది. ఆఫ్టర్‌ కట్స్‌ సినిమా ఎలా ఉంబోతోందో చూడాలి.