Nani : 150 కోట్లా…రిస్క్ చేస్తున్న నాని
దసరా’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్నాడు నాని. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘రా’ ఎమోషనల్ మూవీగా జనాలకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్.

Nani got a massive hit with the movie Dussehra. Srikanth Odela made his directorial debut with this movie.
దసరా’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్నాడు నాని. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘రా’ ఎమోషనల్ మూవీగా జనాలకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్. పక్కింటి కుర్రాడిలా ఉండే నానిని.. ధరణిగా రగ్గ్‌డ్ లుక్‌లో చూపించి షాక్ ఇచ్చి.. సూపర్ హిట్ కొట్టేశాడు. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి.. వంద కోట్ల కలెక్షన్స్‌తో పాన్ ఇండియా హీరోని చేసేసింది దసరా. దీంతో మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది.
దసరా తర్వాత ‘హాయ్ నాన్న’ సినిమా కోసం క్లాస్ లుక్‌లోకి వచ్చేసిన నాని.. ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మళ్లీ మాస్ మోత మోగించేందుకు రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగష్టు 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా 1992, 93 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుందని సమాచారం.
అలాగే.. మొత్తం సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే భారీ సెట్ కూడా వేస్తున్నారట. అయితే.. ఈ సినిమా కోసం ఏకంగా 120 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. నాని మార్కెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. కానీ కంటెంట్‌తో పాటు దసరా కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నారట. 2025లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. 150 కోట్లతో నాని రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి.