హిట్ 3 దర్శకుడిపై నాని సీరియస్.. ఆపై హీరోయిన్ చేయి పట్టుకొని.. వీడియో వైరల్..!
నానికి అభిమానులు ఇప్పుడు కొత్త పేరు పెట్టారు. అదేంటో తెలుసా హిట్ మిషన్.. చేసే దర్శకుడితో అవసరం లేదు.. హీరోయిన్ ఎవరో అక్కర్లేదు..

నానికి అభిమానులు ఇప్పుడు కొత్త పేరు పెట్టారు. అదేంటో తెలుసా హిట్ మిషన్.. చేసే దర్శకుడితో అవసరం లేదు.. హీరోయిన్ ఎవరో అక్కర్లేదు.. బ్యానర్ తో సంబంధం లేదు.. నాని సినిమాలో ఉన్నాడా బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర కామన్ అని ఫిక్స్ అయిపోయారు ఫాన్స్. అందుకే ముద్దుగా హిట్ మిషన్ అని పిలుచుకుంటున్నారు. అదేంటో గాని యాదృచ్ఛికంగా ఇప్పుడు నాని కూడా హిట్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 1న విడుదల కానుంది. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటివరకు నాని కెరీర్లో దసరా 100 కోట్లకు పైన వసూలు చేసింది. ఆ తర్వాత సరిపోదా శనివారం కూడా 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇప్పుడు హిట్ 3 ఈజీగా ఆ రెండింటినీ క్రాస్ చేసేలా కనిపిస్తోంది. హెడ్డింగ్ ఏమో.. హిట్ 3 దర్శకుడిపై నాని సీరియస్ అని పెట్టి.. లోపల ఏమో వేరే మ్యాటర్ చెబుతున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా..!
అక్కడికే వస్తున్నాం.. అయినా సినిమా చూపించు ముందు కొన్నైనా యాడ్స్ వెయ్యాలి కదా.. ఇది కూడా అలాంటిదే అనుకోండి. అసలు విషయం ఏంటంటే.. హిట్ 3 షూటింగ్ పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కనీసం 20 రోజుల ముందే ఫస్ట్ కాపీ రెడీ కావాలని కండిషన్ పెట్టాడు నాని. ఆ తర్వాత దేశమంతా ప్రమోషన్ కోసం తిరగనున్నాడు. అందుకే ప్రమోషన్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయబోతున్నారు టీం. ఇప్పటికే ఈ ప్రమోషన్ మొదలైపోయింది కూడా. ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా సినిమా ప్రమోట్ చేయడం మొదలు పెట్టాడు నాని. అది కూడా తన స్టైల్ లో..! హిట్ 3 సినిమా నుంచి మొదటి సింగిల్ విడుదల చేసే డేట్ వచ్చింది. దీన్ని ఆడియన్స్ కు చెప్పడానికి డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీ ఎంచుకున్నాడు నాని. రెగ్యులర్ గా పాట వస్తుంది చూడండి అని చెప్పడం కంటే దానికోసం ఒక వీడియో చేస్తే బెటర్ అని.. అర్జున్ సర్కార్ గెటప్ లోనే ఆ ప్రమోషనల్ వీడియో చేశాడు.
అందులో ఇద్దరు డాన్సర్స్ పాట రిహార్సల్స్ చేస్తూ ఉంటే.. పక్కనే డైరెక్టర్ శైలేష్ కొలను, హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఉంటారు. నువ్వు ఇలా చేయాలి పాటలో అంటూ హీరోయిన్ కు శైలేష్ చెప్తూ ఉంటే నాని అక్కడికి సీరియస్ గా వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ.. ఔట్ వెళ్లిపోండి అందరు.. అయినా నువ్వేంటి ఎక్కడున్నావ్.. నీకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేదా అంటూ దర్శకుడిపై సీరియస్ అవుతాడు. పాట కోసం రీల్స్ సర్ అంటే.. మనం చేస్తున్న సినిమా ఏంటి మీరు చేస్తున్న ప్రమోషన్ ఏంటి అవసరం లేదు వెళ్లిపోండి అందరు అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు నాని. దాంతో అందరూ వెళ్ళిపోతారు. హీరోయిన్ కూడా వెళ్లిపోతుంటే ఆమె చేయి పట్టుకొని ఆపుతాడు నాని. నేను రీల్స్ వద్దన్నాను.. రొమాన్స్ కాదు అంటూ డైలాగ్ చెప్తాడు. దాంతో వీడియో ఎండ్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎంతైనా తన సినిమాను ప్రమోట్ చేయడంలో నాని ఎప్పుడూ డిఫరెంట్ గానే ఆలోచిస్తుంటాడు. అది సినిమాలకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు హిట్ 3 విషయంలోనూ ఇదే చేస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం కాశ్మీర్, శ్రీనగర్ చుట్టూ తిరుగుతుంది. దాదాపు 80 కోట్లతో ఈ సినిమాను నాని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే నెట్ ఫిక్స్ 54 కోట్లకు ఫిట్ 3 డిజిటల్ రైట్స్ తీసుకుంది. ఆడియో సాటిలైట్ డబ్బింగ్ అన్ని కలిపి మరొక 25 కోట్ల వరకు వస్తాయి. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు నాచురల్ స్టార్. https://www.instagram.com/nameisnani/reel/DHc1fA5x2cT/?hl=en