Nani.. Vijay : తండ్రీకొడుకులుగా విజయ్, నాని
నాని హీరోగా నటించిన 'ఎవడే సుబ్రమణ్యం'లో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హీరోగా మారి.. నాని స్థాయిలో స్టార్ గా ఎదిగాడు.

Nani starrer 'Evade Subramaniam' had Vijay Devarakonda playing a key role.
నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’లో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హీరోగా మారి.. నాని స్థాయిలో స్టార్ గా ఎదిగాడు. అయితే విజయ్ హీరోగా మారిన తర్వాత.. నానితో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఓ సినిమాలో వీరిద్దరూ తండ్రీకొడుకులుగా కనిపించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి వంటి హీరోలు కీలక పాత్రల్లో మెరవనున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. మహాభారతంలోని కీలక పాత్రలలో వీరు కనిపించనున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్రంలో వీరు పోషించిన పాత్రలు ఇవేనంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఓ చర్చ నడుస్తోంది.
‘కల్కి’లో అర్జునుడి పాత్రలో పాత్రలో విజయ్ కనిపించనున్నాడట. ఇక అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి పాత్రలో నాని అలరిస్తాడట. అంటే కల్కి సినిమాలో ఈ ఇద్దరూ తండ్రీకొడుకులుగా కనిపిస్తారన్నమాట. అలాగే, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుగా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడని అంటున్నారు. ఇక దుర్యోధనుడు పాత్రలో రానా దగ్గుబాటి కనువిందు చేయనున్నాడని చెబుతున్నారు.
ఇంకో విశేషం ఏంటంటే.. ఇందులో శ్రీ కృష్ణుడి పాత్ర కూడా సర్ ప్రైజ్ చేయనుందట. టెక్నాలజీని ఉపయోగించి కృష్ణుడి రూపంలో సీనియర్ ఎన్టీఆర్ ని తెర మీద కనిపించేలా చేస్తారట.