వాళ్లకు నరకం చూపిస్తున్న నాని.. ఒకరిని కూడా వదలడంట..!

నాని అంటే మనకు న్యాచురల్ స్టార్. పక్కింటి కుర్రాడులా ఉండే పాత్రలు చేస్తూ అందరికీ కావాల్సిన వాడిలా మారిపోయాడు నాని. కానీ ఈ మధ్య ఆయనలో చాలా మార్పు వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 12:15 PMLast Updated on: Feb 22, 2025 | 12:15 PM

Nani Teaser Pre Look Released

నాని అంటే మనకు న్యాచురల్ స్టార్. పక్కింటి కుర్రాడులా ఉండే పాత్రలు చేస్తూ అందరికీ కావాల్సిన వాడిలా మారిపోయాడు నాని. కానీ ఈ మధ్య ఆయనలో చాలా మార్పు వచ్చింది. మాస్ ఇమేజ్ కోసమని యాక్షన్ సినిమాల వైపు పరుగులు పెడుతున్నాడు నాని. దీనివల్ల కొంత డేంజర్ ఉంది అని తెలిసిన కూడా మార్కెట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో.. తనకు కలిసి వచ్చిన క్లాస్ సినిమాలను కొన్ని రోజులు పక్కన పెట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హిట్ 3 సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో స్వీయ నిర్మాణంలో ఈ సినిమా చేస్తున్నాడు నాని.

అంతేకాదు హిట్ 3 సినిమాకు కథ విషయంలో కూడా నాని హ్యాండ్ ఉందని తెలుస్తుంది. దర్శకుడు శైలేష్ కొలనుకు సినిమా మెయిన్ లైన్ నాని ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రీ లుక్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎంత మాస్ యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండబోతుందో అర్థం అవుతుంది. ఇప్పటి వరకు నాని చేసిన సినిమాల్లో ద మోస్ట్ వైలెంట్ సినిమా హిట్ 3. పిల్లలకు నో ఎంట్రీ బోర్డు ఉంటుందని ఇప్పటికే ఈ సినిమా గురించి హైప్ పెంచేస్తున్నాడు నాని. తాజాగా విడుదలైన లుక్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చింది.

మే 1న సినిమా విడుదల కానుంది. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు హిట్ 3 టీజర్ విడుదల కానుంది. దీనికోసం నాచురల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అలాగే కామన్ ఆడియన్స్ కూడా నాని హై వోల్టేజ్ యాక్షన్ చూడాలని ఎదురు చూస్తున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నాడు నాని. 100 మంది నిజాయితీ పరులు చచ్చిపోయిన పర్లేదు కానీ.. ఒక్క నేరస్తుడు మాత్రం తప్పించుకోకూడదు అనుకునే పాత్ర ఇది.