నాని Vs విజయ్ దేవరకొండ.. నిజంగానే రౌడీ హీరోని నాని తొక్కేస్తున్నాడా..?
నాని, విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుంది.. రౌడీ హీరోని కావాలనే నాని తొక్కేస్తున్నాడు.. విజయ్ కెరీర్ నాశనం చేయడానికి ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నాడు నాని..!

నాని, విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుంది.. రౌడీ హీరోని కావాలనే నాని తొక్కేస్తున్నాడు.. విజయ్ కెరీర్ నాశనం చేయడానికి ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నాడు నాని..! సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా బాగా జరుగుతున్న ప్రచారం ఇది. నిజానిజాలు ఏంటో తెలియదు కానీ నాని, విజయ్ దేవరకొండ మధ్య నిజంగానే ఏదో పెద్ద గొడవ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతుంది. ఉన్నట్టుండి ఈ ప్రచారం ఎందుకు తెర మీదకు వచ్చింది అనుకోవచ్చు.. దీనికి కారణం ఒక ఫేమస్ యూట్యూబర్.
మొదటి రోజు సినిమా చూసి అది బాలేదు అని చెప్పడమే ఆయనకు తెలిసిన విద్య. ఆ సినిమా ఎలా ఉన్నా కూడా దాన్ని చీల్చి చెండాడి నెగిటివ్ గా చెప్పడమే ఆయనకు తెలిసిన రివ్యూ. మనోడు కనిపిస్తేనే యూట్యూబ్లో ఓ రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ఇక ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ మధ్య ఏదో నడుస్తుంది అంట ఆయన పెట్టిన పెంట నెక్స్ట్ లెవెల్ లో అంటుకుంటుంది. ఒకడేమో సడన్ గా వచ్చి బాగా పైకి లేచాడు.. ఇంకొకడు మంచోడు మంచోడు అంటూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నాడు.. తనకంటే తర్వాత వచ్చినవాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు ఆ మంచోడు డబ్బులు పెట్టి మరి అవతల వాన్ని ముంచే పనిలో ఉన్నాడు అంటూ సదరు యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు నానికి విజయ్ దేవరకొండలో తొక్కాల్సిన అవసరం ఏముంది.. ఇద్దరూ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు.. స్టార్స్ అయ్యారు.. బ్యాగ్రౌండ్ లేకుండా అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకున్నారు.. అలాంటప్పుడు నాని ఎందుకు విజయ్ కెరీర్ నాశనం చేయాలి అనుకుంటాడు అంటూ ఒక వర్గం బలంగానే వాదిస్తుంది.
పైగా విజయ్ కెరీర్ ఎదగడానికి హెల్ప్ చేసింది కూడా నానియే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన తర్వాత విజయ్ దేవరకొండ అనే వాడు ఒకడు ఉన్నాడు అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక కీలకపాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశాడు నాని. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాకు కూడా తన వంతు సాయం చేశాడు. అక్కడి నుంచి విజయ్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా నాని హెల్ప్ చేస్తూనే ఉంటాడు. మన వైపు నాని మీద అంతే కృతజ్ఞత భావం చూపిస్తుంటాడు విజయ్ దేవరకొండ. అలాంటి ఇద్దరు హీరోల మధ్య కావాలనే చిచ్చుపెట్టాడు ఆ యూట్యూబర్ అంటూ ఇప్పుడు ఆయనను ఓ రేంజ్ లో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిపి వేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ మధ్య ఉన్న గొడవలు చాలు.. లేనిపోనివి కొత్త చిచ్చు పెట్టకండి అంటున్నారు ఫ్యాన్స్.