NANI: రూటే సెపరేటు.. నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ నానినే

ఇప్పటికే తెలుగులో సినిమా సినిమాకి అభిమానులను పెంచుకుంటూ న్యాచురల్ స్టార్‌గా ఎదిగిన నాని.. ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ని పెంచుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని జోరు చూస్తుంటే త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గా అవతరించే అవకాశముంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 02:12 PMLast Updated on: Feb 12, 2024 | 5:01 PM

Nani Will Be Next Pan India Star From Tollywood

NANI: ఈ జనరేషన్‌లో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్‌గా ఎదిగిన యంగ్ హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. నాని సినిమా వస్తుందంటే ఖచ్చితంగా విషయం ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగేలా చేసుకోగలిగాడు. అందుకే హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా.. నాని సినిమాలకు చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తుంటాయి. ఇప్పటికే తెలుగులో సినిమా సినిమాకి అభిమానులను పెంచుకుంటూ న్యాచురల్ స్టార్‌గా ఎదిగిన నాని.. ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ని పెంచుకునే పనిలో పడ్డాడు.

Harish Shankar: మాస్ వార్నింగ్.. హరీష్‌ శంకర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌

ప్రస్తుతం నాని జోరు చూస్తుంటే త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గా అవతరించే అవకాశముంది. నానికి ఇప్పటికే ఇతర సౌత్ భాషల్లో మంచి గుర్తింపు ఉంది. ఓ వైపు సౌత్‌లో తన మార్కెట్‌ని పెంచుకుంటూనే, మరోవైపు నార్త్ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు నాని. ఇప్పటిదాకా తమ సినిమాలతో నార్త్‌లోనూ మంచి వసూళ్లు రాబట్టి.. పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న హీరోలు ఉన్నారు. అయితే నాని రూట్ మాత్రం సెపరేట్ అన్నట్టుగా ఉంది. ఇటీవల నాని కూడా తన సినిమాలను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. అయితే నార్త్‌లో నాని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మ్యాజిక్ చేయడంలేదు. కనీస వసూళ్లకే పరిమితం అవుతున్నాయి. అయినప్పటికీ ఓటీటీ ద్వారా నాని పలు భాషల ప్రేక్షకులకు చేరువ అవుతున్నాడు. నాని సినిమాలకు ఓటీటీలో విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన గత చిత్రాలు ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికీ’, ‘దసరా’.. ఇతర భాషల ప్రేక్షకులను ఓటీటీలో ఎంతగానో అలరించాయి.

ఇక ఇటీవల విడుదలైన ‘హాయ్ నాన్న’ అయితే ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కంటెంట్‌కి, నాని పర్ఫామెన్స్‌కి ఫిదా అవుతున్న నార్త్ ఆడియన్స్.. ఆయన గత చిత్రాలను చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వారు నాని గత చిత్రాలను కూడా చూసి, మరింత ఇంప్రెస్ అయితే.. నెక్స్ట్ నుంచి నాని సినిమాలను థియేటర్లలో కూడా ఆదరించే అవకాశముంది. ఇలాగే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో నాని అలరిస్తే.. బలమైన పునాదులు వేసుకుంటూ సైలెంట్‌గా భవిష్యత్‌లో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.