మెగాస్టార్ రెమ్యూనరేషన్ కు నానీకి వణికింది.. అంత ఇవ్వలేను సార్ ప్లీజ్
టాలీవుడ్ లో వయసు మీద పడుతున్న సరే వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి దుమ్ము రేపుతున్నారు. ఒకప్పుడు ఎలా అయితే వరుస సినిమాలతో హడావుడి చేశారో ఇప్పుడు కూడా అలాగే మెగాస్టార్ వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో వయసు మీద పడుతున్న సరే వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి దుమ్ము రేపుతున్నారు. ఒకప్పుడు ఎలా అయితే వరుస సినిమాలతో హడావుడి చేశారో ఇప్పుడు కూడా అలాగే మెగాస్టార్ వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కూడా చిరంజీవి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. బడ్జెట్ భారీగా ఉండేలా ప్లాన్ చేసుకుని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
ఒక్కో సినిమాకు రెండేళ్ల వరకు గ్యాప్ తీసుకుంటున్న చిరంజీవి ఎప్పుడూ విశ్వంభరా అనే సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఆడియన్స్ ను ఫిదా చేశాయి. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల అనే డైరెక్టర్ తో సినిమా చేయనున్నారు మెగాస్టార్. సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేస్తున్న మెగాస్టార్ ఇప్పుడు చేస్తున్న విశ్వంభరా సినిమాకు దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు చార్జి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నిర్మాతలు కూడా ఎక్కడా వెనుకడుగు వేయకపోవడంతో మెగాస్టార్ రెమ్యూనరేషన్ లో తన డామినేషన్ చూపిస్తున్నారు.
ఇప్పుడు నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చేయబోతున్న సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే వస్తుంది. ఈ సినిమాకు కూడా చిరంజీవి భారీగానే డిమాండ్ చేశారు. దాదాపు 75 కోట్లు డిమాండ్ చేయడంతో నాని ముందు షాక్ అయ్యాడట. సినిమా కథ విన్న చిరంజీవి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ కూడా భారీగా జరిగే ఛాన్స్ ఉందని సౌత్ ఇండియాలో ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి నానిని ఆ రేంజ్ లో డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ముందు నాని భయపడి వెనకడుగు వేసిన ఆ తర్వాత మాత్రం శ్రీకాంత్ జోక్యం చేసుకున్నాడట.
ఎలాగైనా సరే ఈ సినిమాను కంప్లీట్ చేయాలని వేరే విషయాల్లో ఖర్చులు తగ్గించుకునీ ముందుకు వెళదామని నానికి నచ్చజెప్పి ఒప్పించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సినిమా బడ్జెట్ 150 కోట్లని ముందు ప్లాన్ చేశారు. ఇప్పుడు రెమ్యునరేషన్ చిరంజీవి భారీగా డిమాండ్ చేయడంతో నాని కూడా డిఫెన్స్ లో పడ్డాడు. ఇప్పటివరకు చిన్న చిన్న సినిమాలు ప్లాన్ చేసిన నాని ఇప్పుడు మెగాస్టార్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసి భారీగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ కావడంతో కాస్త టెన్షన్ పడుతున్నాడట. ఈ సినిమా కోసం మరో నిర్మాణ సంస్థ కూడా పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉండటంతో బడ్జెట్ పెరిగితే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని వాళ్లకు కొంత షేర్ ఇవ్వాలని నాని రెడీ అయ్యాడు. వచ్చేయడాది మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.