Oscar Race 2024: తెలుగు సినిమా కీర్తి.. 2024 ఆస్కార్‌కి దసరా..
మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని హీరోగా, గత సంవత్సరం మార్చ్ 20న వచ్చిన దసరా మూవీ ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. మన తెలుగు నుంచి ఇప్పటివరకు నామినేట్ అయ్యిన మూవీ దసరానే కావటం గమనార్హం.

Oscar Race 2024: సినిమా.. సినిమా.. సినిమా.. ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఆ దేశాల్లో ఎన్ని భాషలు ఉన్నాయో.. వాటన్నింటిలోను సినిమాలు తెరకెక్కుతుంటాయి. వీళ్లందరి లక్ష్యం ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డుగా భావించే ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం. ఈ అవార్డు పొందితే చాలు.. తమ సినిమా జీవితం ధన్యమయినట్టే అని 24 క్రాఫ్ట్స్‌కి చెందిన వాళ్లు భావిస్తారు. మరి సినిమాని ప్రపంచ సినిమాగా మార్చిన ఆస్కార్‌కి ఈ సారి మన ఇండియా నుంచి కొన్ని సినిమాలు నామినేట్ అయ్యాయి.
Vijay Devarkonda: ప్రభాస్ మూవీలో రౌడీ హీరో.. విజయ్ దేవరకొండ జాక్‌పాట్..!
మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని హీరోగా, గత సంవత్సరం మార్చ్ 20న వచ్చిన దసరా మూవీ ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. మన తెలుగు నుంచి ఇప్పటివరకు నామినేట్ అయ్యిన మూవీ దసరానే కావటం గమనార్హం. ఇంకేమైనా సినిమాలు నామినేట్ అవుతాయో చూడాలి. దసరాలో తన క్యారక్టర్ కోసం నాని పడిన కష్టం మొత్తం సిల్వర్ స్క్రీన్ మీద కనపడుతుంది. ఇక హిందీలో చూసుకుంటే ది స్టోరీ టెల్లర్, సంగీత పాఠశాల, శ్రీమతి ఛటర్జీ vs నార్వే, డంకీ, 12th ఫెయిల్, జూమర్, రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, ది కేరళ స్టోరీ, గదర్ 2, ఆబ్‌తో సబ్ భగవాన్ భరోసా లాంటి చిత్రాలు ఉన్నాయి. తమిళం నుంచి విడుతలై పార్ట్ 1, మలయాళం నుంచి 2018, మరాఠీ నుంచి బాప్ లియోక్ చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి.
ప్రస్తుతానికి మన ఇండియా నుంచి ఈ సంవత్సరానికిగాను ఇప్పటివరకు ఆస్కార్‌కి నామినేట్ అయిన సినిమాలు అయితే అవే. 2023లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ని దక్కించుకొని ఇండియన్ సినిమా కీర్తితో పాటు తెలుగు సినిమా కీర్తిని విశ్వ వేదికపై నిలిపినట్టుగా ఈ సారి కూడా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి.