NANI: మరీ అఖిల్‌లానే.. ఇంత ఘోరమా నాని..?
కెరీర్‌లో రెండు సార్లు సెంచరీ కొట్టిన నాని, తన రెమ్యునరేషన్ కంటే బడ్జెట్‌తోనే పరేషాన్ చేసేలా ఉన్నాడు. ఎందుకంటే తన కొత్త మూవీ సరిపోదా శనివారం బడ్జెట్ రూ.90 కోట్లని తెలుస్తోంది. కెరీర్‌లో ఎంత వందకోట్ల సినిమాలు రెండు ఉంటే మాత్రం మరీ 90 కోట్ల బడ్జెట్‌తో మూవీ తీస్తే ఎలా..?
NANI: న్యాచురల్ స్టార్ నాని 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. దసరా 100 కోట్లు రాబడితే, హాయ్ నాన్న నాన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు వసూళ్లను లెక్కేస్తే 100 కోట్లని తేలాయి. కెరీర్‌లో రెండు సార్లు సెంచరీ కొట్టిన నాని, తన రెమ్యునరేషన్ కంటే బడ్జెట్‌తోనే పరేషాన్ చేసేలా ఉన్నాడు. ఎందుకంటే తన కొత్త మూవీ సరిపోదా శనివారం బడ్జెట్ రూ.90 కోట్లని తెలుస్తోంది.
Virat Kohli: టీ ట్వంటీల్లో కోహ్లీ కెరీర్ ముగిసినట్టే.. వరల్డ్ కప్ టీమ్ నుంచి కోహ్లీ ఔట్..?
కెరీర్‌లో ఎంత వందకోట్ల సినిమాలు రెండు ఉంటే మాత్రం మరీ 90 కోట్ల బడ్జెట్‌తో మూవీ తీస్తే ఎలా..? ఎందుకంటే ఇది హిట్టైనా వందకోట్లు రాబట్టినా, నిర్మాతకి మిగిలేది ఏంటో అర్ధం కావట్లేదంటున్నారు. షేర్లు అన్నీ తీసేస్తే దసరా, హాయ్ నాన్న మూవీ నిర్మాత చేతికి అందింది 60 కోట్ల లెక్కలే. ఏదో శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో అదనంగా వచ్చింది కాని, ఇప్పుడు 90 కోట్లు సరిపోదా శనివారం మూవీకే పెడితే, అది 150 కోట్లు రాబడితే తప్ప నిర్మాత కాని, డిస్ట్రిబ్యూటర్లు కాని గట్టెక్కరు. అసలు అంత బడ్జె తో తెరకెక్కిస్తే డిస్ట్రిబ్యూటర్లు కొనటానికి ముందుకొస్తారా? అంత బడ్జెట్ అంటే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా భారీగానే ఉంటాయి.
విచిత్రం ఏంటంటే అఖిల్ మూవీ ఏజెంట్‌కి ఇలానే 80 కోట్లు పెట్టి నిర్మాత నిండా మునిగాడు. మరో నిర్మాత వందకోట్లు పెడుతున్నాడు. సరే అఖిల్‌కి మార్కెట్ లేదు వేరే విషయం. కానీ, నానికి మంచి మార్కెట్ ఉంది. వందకోట్ల వసూళ్లొచ్చిన రెండు సినిమాలు తన ఎకౌంట్‌లో ఉన్నాయి. అలాగని 90 కోట్ల బడ్జెట్ అంటే అసలుకే ఎసరనే కామెంట్లు పెరిగాయి.