నాని ‘ది ప్యారడైజ్’ టీజర్.. ఒక లం.. కొడుకు కథ..! 100 KGFలు కలిసాయేమో..?

ఒకప్పుడు నాని ఎలా ఉన్నాడు.. ఇప్పుడెలా ఉన్నాడు..? అయినా కెరీర్ అన్నాక ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా..? ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతున్నపుడు మనం కూడా మారాలి కదా అంటున్నాడు నాని

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2025 | 01:00 PMLast Updated on: Mar 04, 2025 | 1:00 PM

Nanis The Paradise Teaser

ఒకప్పుడు నాని ఎలా ఉన్నాడు.. ఇప్పుడెలా ఉన్నాడు..? అయినా కెరీర్ అన్నాక ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా..? ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతున్నపుడు మనం కూడా మారాలి కదా అంటున్నాడు నాని. ఇప్పుడు ప్యారడైజ్ టీజర్ చూసాక నాని ఏం రేంజ్‌లో మారిపోయాడో అర్థమవుతుంది. మొన్న హిట్ 3 టీజర్ చూసినపుడే నాని మేకోవర్‌పై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడేకంగా అందరికీ క్లారిటీ కాదు.. దానికి మించి వచ్చింది. ఇకపై తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాడనే విషయంపై కూడా పూర్తిగా బల్లగుద్ధి చెప్పాడు న్యాచురల్ స్టార్. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్యారడైజ్ టీజర్ మరో హింట్ ఇచ్చింది. అయినా తెగిలించాలని ఫిక్సైనపుడు.. పూర్తిగా తెగించాలబ్బా.. మళ్లీ సగం సగం పట్టుకుని వేలాడకూడదు. నాని ఇదే చేస్తున్నాడిప్పుడు.

మొన్న హిట్ 3యే అనుకుంటే.. ఇప్పుడు దానికి అమ్మమ్మ లాంటి సినిమాతో వస్తున్నాడు. ది ప్యారడైజ్ టీజర్ చూస్తుంటేనే లోలోపల భయం మొదలవుతుంది. అసలు ఈ టీజర్ చూసాక నాని కరెక్ట్ ట్రాక్‌లోనే వెళ్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. నాని అంటే మన ఆడియన్స్‌కు ఇలాగే కూల్‌గా పక్కింటి అబ్బాయిగా కనిపించేవాడు..! ఏమండోయ్ నానిగారూ అని పిలిస్తే.. ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయ్ ఆయన క్యారెక్టర్స్.. కానీ ఇప్పుడేమో అందనంత దూరంగా వెళ్లిపోతున్నాడు అనిపిస్తుంది. రాను రాను వయొలెన్స్‌కు మరీ చేరువవుతున్నాడు నాని. మొన్న హిట్ 3 టీజర్ చూసాకే.. అందరికీ మైండ్ పోయిందంటే ఇప్పుడు ది ప్యారడైజ్ టీజర్ చూసాక.. ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. హిట్ 3, ప్యారడైజ్ టీజర్స్ చూస్తుంటే నాని ఎలాంటి సినిమాల వైపు వెళ్తున్నాడనే విషయం అర్థమవుతుంది.

ఇక టీజర్ విషయానికి వస్తే.. రా అండ్ రస్టిక్‌గా ఉంది. సికింద్రాబాద్‌లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇందులో నాని క్యారెక్టరైజేషన్ చాలా భయంకరంగా ఉండబోతుంది. పైగా టీజర్‌లోనే చేతిపై లం.. కొడుకు అంటూ పచ్చబొట్టు వేయించాడు దర్శకుడు ఓదెల. దీన్ని బట్టి ఆయన పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. టీజర్‌లో కేజియఫ్ ఛాయలు కనిపిస్తున్నాయి.. కానీ రెండూ డిఫెరెంట్ కథలు అని అర్థమవుతుంది. మరోవైపు అనిరుధ్ మ్యూజిక్ కూడా మామూలుగా లేదు. మార్చి 26, 2026న విడుదల కానుంది ది ప్యారడైజ్.