కల్కీ పార్ట్ 2లో నానీ రోల్ అదేనా, నానీ రియాక్షన్ ఇదే..

సరిపోదా శనివారం సినిమా సూపర్ హిట్ కావడంతో న్యాచురల్ స్టార్ నానీ ఇప్పుడు తర్వాతి ప్రాజెక్ట్ ల మీద సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాడు. చాన్నాళ్ళ తర్వాత నానీకి మంచి హిట్ దొరికింది అనే చెప్పాలి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2024 | 03:30 PMLast Updated on: Aug 31, 2024 | 3:30 PM

Nannys Role In Kalki Part 2 Is The Same Nannys Reaction Is This

సరిపోదా శనివారం సినిమా సూపర్ హిట్ కావడంతో న్యాచురల్ స్టార్ నానీ ఇప్పుడు తర్వాతి ప్రాజెక్ట్ ల మీద సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాడు. చాన్నాళ్ళ తర్వాత నానీకి మంచి హిట్ దొరికింది అనే చెప్పాలి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. ఈ హిట్ తర్వాత నానీ స్టార్ డైరెక్టర్ సినిమాకు సైన్ చేసే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి. అటు తమిళ ప్రాజెక్ట్ ఒకటి కూడా నానీకి లైన్ లో ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇక ఇప్పుడు మరో వార్త కూడా ఒకటి వైరల్ గా మారింది.

అదే నానీ… కల్కీ పార్ట్ 2 లో ఉంటాడు అనే వార్తలు వస్తున్నాయి. కల్కీ పార్ట్ 2 లో నానీ కృష్ణుడు పాత్రలో నటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. దీనిపై నానీని ప్రశ్నించగా… అసలు తాను నటించడం లేదు అని స్పష్టం లేదు. రెండో పార్ట్ లో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు, కర్ణుడు పాత్రలే కీలకం అన్నాడు. ఈ సీక్వెల్ లో కృష్ణుడి ముఖాన్ని చూపించడం లేదని దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టం చేసాడన్న నానీ… నేను పార్ట్ లో ఉన్నట్టు రూమర్స్ ఏ విధంగా మొదలయ్యాయో తెలియడం లేదు అన్నాడు.

బహుసా నేను ఆ టీం తో కలిసి ఎక్కువ సార్లు కనపడటమే కారణం అయి ఉండవచ్చు అన్నాడు. అందులో అతిథి పాత్ర గురించి తాను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడలేదు అని… కాని ఆ టీం తో కలిసి పని చేయడానికి ఆసక్తికరంగా ఉన్నా అని నానీ చెప్పుకొచ్చాడు. కల్కీ పార్ట్ 2 విషయానికి వస్తే షూటింగ్ జనవరి తర్వాత మొదలయ్యే అవకాశం కనపడుతుంది. దీనికి సంబంధించి రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కొంత భాగం యూరప్ లో షూట్ చేస్తారని సినీ వర్గాలు అంటున్నాయి.