ఆ హీరో సినిమా చేయాలంటే చంద్రబాబు సిఎం కావాల్సిందేనా
2009 నుంచి 2014 వరకు 5 సినిమాలు, 2014 నుంచి 2019 వరకు 18 సినిమాలు... ఇది ఒక హీరో గారి ట్రాక్ రికార్డ్. తన పెదనాన్న సిఎం అయితే మాత్రమే ఆయన సినిమాలు చేస్తారు.
2009 నుంచి 2014 వరకు 5 సినిమాలు, 2014 నుంచి 2019 వరకు 18 సినిమాలు… ఇది ఒక హీరో గారి ట్రాక్ రికార్డ్. తన పెదనాన్న సిఎం అయితే మాత్రమే ఆయన సినిమాలు చేస్తారు. లేదంటే అసలు కెమెరా వైపు కూడా చూసే ప్రయత్నం చేయరు. ఇప్పుడు మళ్ళీ పెదనాన్న సిఎం అయ్యారు… మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇంతకు ఆ హీరో గారు ఎవరా అనుకుంటున్నారా…? ఆయనే నారా రోహిత్. గత అయిదేళ్ళు అంటే 2019 నుంచి 2024 జూన్ వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు.
అసలు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మళ్ళీ సుందరాకాండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొన్నా మధ్య ప్రతినిధి 2 సినిమాను కూడా విడుదల చేసారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఈ రెండు సినిమాలు వచ్చాయి. మరో రెండు మూడు సినిమాలను నారా రోహిత్ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. దీని వెనుక కారణం ఏంటో తెలియదు గాని… నారా రోహిత్ మాత్రం వేరే పనులు ఏం లేకుండా సినిమాల మీదనే దృష్టి పెడుతున్నారు.
గత 5 ఏళ్ళు ఆయన దూరంగా ఉండటానికి ఒక కారణం ఉండి ఉండవచ్చు… తన సినిమాలను విడుదల కానీయకుండా ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని, అందుకే నారా రోహిత్ అసలు సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపించకపోయి ఉండవచ్చు. స్టార్ హీరోలనే ఇబ్బంది పెట్టారు నేను ఒక లెక్కా అనుకుని రోహిత్ అనుకున్నారేమో. దానికి తోడు తాను నారా కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఇబ్బంది పెట్టవచ్చు అని కూడా భావించి ఉండవచ్చు. అందుకే నారా రోహిత్ సాహసం చేయలేదు. మరి గత అయిదేళ్ళు ఆయన సినిమాలు చేయలేదు కాబట్టి… ఇప్పుడు చేస్తే జనాలు చూస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీసిన సినిమాల్లో ఫ్లాప్ లే ఎక్కువ. మరి ఇప్పుడైనా హిట్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.