Pavithra Naresh:షెడ్డుకొచ్చిన బండికి సౌండ్ ఎక్కువ.. పవిత్ర నరేష్ పెళ్లి కూడా అంతేనా?
నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమ పెళ్లి కథ అడ్డం తిరిగింది. లిప్‌కిస్ పెట్టుకుని.. త్వరలో పెళ్లన్నారు. పెళ్లి చేసుకుని హనీమూన్ ట్రిప్ వేశారు. అయితే ఇదంతా నిజం పెళ్లి కాదని తేలిపోయింది. సినిమాలో జరిగిన పెళ్లిని నిజం పెళ్లిగా బిల్డప్ ఇచ్చారు. రియల్ లైప్‌లో లవర్స్ కావడంతో చాలామంది వీళ్ల వేషాలను నమ్మేశారు. ఇదంగా సినిమా అని తెలిశాక ట్రోలింగ్ మరింత పెరిగింది.
సమ్మోహనంలో పరిచయం ప్రేమకు.. లివ్వింగ్ రిలేషన్ షిప్‌కు దారితీసింది. లిప్ కిస్ పెట్టుకుని వీడియో రిలీజ్ చేస్తే.. ఎంతైనా లవర్స్ కదా అనుకున్నారు. పెళ్లి చేసుకుంటే.. మూడో భార్యకు డివోర్స్ ఇవ్వకుండా ఎలా సాధ్యమైంది కొందరు అనుకున్నా.. చాలామంది నమ్మేశారు. ఇక హనీమూన్ ట్రిప్ విజువల్స్ చూసి.. న్యూ కపుల్ .. ఎంతైనా రిచ్ బ్యాచ్ కదా.. హనీమూన్‌కు దుబాయ్ కాకపోతే.. మాల్దీవ్స్ వెళ్లారన్నారు. అయితే ఇవన్నీ ‘మళ్లీ పెళ్లి’ సినిమాలోని సీన్స్ అని లేటుగా తెలిసింది.
రియల్ లవర్స్ నరేష్, పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాలో నటించగా.. ప్రోమోను రిలీజ్ చేశారు. నరేష్ తన సొంత బేనర్ విజయకృష్ణ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు ఎం.ఎస్ రాజు దర్శకుడు. ప్రోమో చూసిన తర్వాత ఈ డైనమిక్ కపుల్‌పై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. అంతేకాదు.. సినిమాపై చాలా అనుమానాలు క్రియేట్ అయ్యాయి.
‘మళ్లీ పెళ్లి’ ప్రోమో రిలీజ్ తర్వాత ట్రోలర్స్ కథలు ఇంట్రస్ట్ కలిగిస్తున్నాయి. మీ లవ్ స్టోరీనే సినిమాగా తీసేసేవా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్‌పై విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇవ్వానికి మళ్లీ పెళ్లి ఎందుచకు చేసుకోవాల్సిందో చెప్పడానికే కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశావా అని అడుగుతున్నారు. టైటిల్లో పేరు ముందు ‘నవరస రాయ’ అంటూ బిరుదుపై మీమ్స్ పుట్టుకొచ్చాయి. నువ్వు నవరస రాయ కాదు.. శృంగార రాయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
సినిమాను తెలుగుతోపాటు.. కన్నడలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమాను బైలింగ్వల్‌గా రిలీజ్ చేయాలంటే.. తమిళంలో విడుదల చేస్తారు. కానీ.. కన్నడలో రిలీజ్ చేయడం వెనుక పెద్ద ప్లానే వుందట. పవిత్రా లోకేష్ కన్నడ అమ్మాయి కావడంతో… మీ ప్రేమను అక్కడి ప్రేక్షకులకు కూడా చెప్పి కన్విన్స్ చేయడానికి ఈ బైలింగ్వల్ మూవీనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి నరేష్ పవత్రా లోకేష్‌తో లవ్‌స్టోరీ.. సహజీవనాన్నే సినిమా కథగా తీశాడో లేదో తెలియాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.