అందులో సగం ఉన్నా చాలు… 1000 కోట్ల తాండవం…
నటసింహం బాలయ్య అఖండ సీక్వెల్ తాలూకు అప్ డేట్ వచ్చింది. మహాశివరాత్రికి మహా పోస్టర్ ని రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. కేవలం పోస్టర్ వరకే కాదు, మోషన్ టీజర్ కూడా రానుందని తెలుస్తోంది.
నటసింహం బాలయ్య అఖండ సీక్వెల్ తాలూకు అప్ డేట్ వచ్చింది. మహాశివరాత్రికి మహా పోస్టర్ ని రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. కేవలం పోస్టర్ వరకే కాదు, మోషన్ టీజర్ కూడా రానుందని తెలుస్తోంది. బేసిగ్గా పెద్ద హీరోల మూవీలేవి మొదలౌతున్నా.. లేదంటే మొదలైనా, ఇలాంటి అప్ డేట్స్ రావటం వెరీ వెరీ కామన్. కాని ఈ సారి అఖండ 2 ఫస్ట్ లుక్ మాత్రం కామన్ కాదు. హిందీ ఆడియన్సే టార్గెట్ గా అఖండ తాండవం ఉండబోతోంది. క్యాప్షన్ గా తాండవం పేరుని పెట్టినప్పుడే ఇది నార్త్ ఇండియాలో పూనకాలు తెప్పించే ప్రయత్నమని తెలుస్తోంది. అఖండతో పోలిస్తే అందులో సగం కంటెంట్ అఖండ 2 లో ఉన్నా చాలు, ఉత్తరాది ఊగిపోవాల్సింది… దానికి తగ్గట్టే బోయపాటి పాన్ ఇండియా ని టార్గెట్ చేశాడు. ఇంతకి అఖండ 2 లో అఘోరాగా బాలయ్యగా కొత్తగా ఏం సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అఖండలో నాయకుడిగా, అఘోరగా రెండు పాత్రల్లో మెరిసిన నటసింహం, ఈసారి అంతకు మించే ఏం కొత్తగా తాండవం ప్లాన్ చేశాడు? ఆ తాండవం వెనకున్న సర్ ప్రైజే ఏంటి..? హావేలుక్
నార్త్ ఇండియాలో వసూల్ల పూనకాలు రావాలంటే, ఐటే మాస్ మతిపోగొట్టే ఊరమాస్ మూవీ రావాలి.. లేదంటే డివోషనల్ గా ఎమోషన్ క్యారీ అవ్వాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 సక్సెస్ అయ్యిందక్కడే… సలార్, సాహో కూడా అక్కడే వసూల్ల వరద తెచ్చాయి. ఇక కార్తికేయ, హనుమాన్ లాంటి హిట్ల వెనక, కల్కీ 1200 కోట్ల వసూళ్ల వెనక ఇదే రీజనుంది..
అందుకే పాన్ ఇండియా హిట్ లేకున్నా అఖండ సీక్వెల్ తో నటసింహం బాలయ్య, నార్త్ ఇండియాని ఊపేసేలా ఉన్నాడు. అఖండ 2 తాండవం తో ఉత్తారిదిని ఊపేసేందుకు పెద్ద స్కెచ్చేవేశాడు. మహాశివరాత్రికి అఖండ 2 తాలూకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రెండూ కూడా కాశీలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది దసరాకు కాస్త ముందు సెప్టెంబర్ 25 న రిలీజ్ కాబోతోంది.
బోయపాటి శీను కూడా వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు కొడుతున్న టైంలో, అఖండ వచ్చి తనని గట్టెక్కిందిచంది. హిందిలో డైరెక్ట్ గా రిలీజ్ కాకున్నా, యూట్యూబ్, లేదంటే శాటిలైట్, ఓటీటీ రూపంలో నార్త్ ని ఊపేసింది ఈ మూవీ. అందుకే అఖండ సీక్వెల్ ని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేశారు. అఖండ 2 పోస్టర్ ని కూడా నార్త్ ఇండియాలోనే రిలీజ్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్, పుష్ప2 ఈవెంట్లు కూడా నార్త్ ఇండియాలోనే జరిగాయి…
అయితే అఖండలో నాయకుడిగా బాలయ్య కనిసిస్తూనే, మరో పాత్ర అఘోరలో తన విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు అఖండ 2 లో మూడో బాలయ్య రాబోతున్నాడా? ఇది కాస్త బాహుబలి 3 కాన్సెప్ట్ లా అనిపించొచ్చు కాని, బోయపాటి టీం లీకులతో, కిక్ ఇచ్చే అంశం బయటికొచ్చింది. నాగ సాధువుటా 120 ఏళ్లుగా హిమాలయాల్లో ఉండే తండ్రి పాత్రలో కూడా బాలయ్య కనిపిస్తాడట.
అఖండలో అన్నదమ్ముల పాత్రలే కనిపించాయి. అందులో ఒక పాత్ర అఘోరా… అయితే నాగ సాధువుగా తండ్రి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడని తెలుస్తోంది.దీంతో అఘోరాకి, నాగసాధువుకి ఉన్నా తేడానే ఈ సినిమా సీక్వెల్ లో మేయిన్ స్టోరీ లైన్ అని తెలుస్తోంది. మరి అఘోరా పాత్ర వస్తేనే వసూళ్ల వరదొచ్చింది. అలాంటిది మూడో బాలయ్య తండ్రి పాత్రలో అది కూడా నాగ సాధువుగా కనిపిస్తే, ఇక పూనకాలే… అసలే కుంభమేళ జరుగుతున్నవేళ, ఇలాంటి లీకులతో ఫ్యాన్స్ లోకూడా పూనకాలొచ్చే ఛాన్స్ఉంది. మొత్తానికి కాశీలో రిలీజ్ చేయబోయే ఫస్ట్ లుక్ నాగ సాధువుగా తండ్రి పాత్రలో మూడో బాలయ్య పోస్టర్ అని తెలుస్తోంది.