Bhola Shankar: పాపం భోళా శంకర్.. నేషనల్ లెవల్లో వాయించేస్తున్నారు..!!
ఎలా చూసినా హిట్ పడ్డప్పుడు మెచ్చుకున్న వాళ్లే ఫ్లాప్ పడగానే కామెంట్ చేయటం కామన్.. ఈ రివ్యూల్లోని లోతులో నిజాలెంతో కాని, సోషల్ మీడియాలో ఇలా ఆ చానల్ అంటోంది. ఈ పేపర్ అనేస్తోందన్న వార్తలు, వాటికి తోడు నెటీజన్స్ ట్రోలింగ్ మితిమీరిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి ఏ క్షణాన మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇచ్చాడో కానీ చిరు ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది. అవుతోంది.. ఏదో వరసకు తమ్ముడనుకుంటే, కొంపముంచాడు. ఇప్పడు చిరుని సోషల్ మీడియాలోనే కాదు, నేషనల్ మీడియా కూడా ఫుల్ గా వాయించేస్తోంది.
ది హిందూలో అయితే భోళా శంకర్ మూవీ మనల్ని పుష్కరకాలం వెనక్కి తీసుకెళుతుందని రివ్యూ ఇచ్చింది.. తొక్కలో విలన్ కి తోడు కాక్ టేయిల్ బాండ్ లాంటి బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అన్నారు. కొన్ని మీడియా ఛానల్స్ ఇది సిల్లీ రొమాన్స్, దిక్కుమాలిన కామెడీ, చెత్త మ్యూజిక్ అని గట్టిగా వేసుకున్నాయి.
ఇక ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో భోళా శంకర్లో ఏం లేదు.. అసలు కథ లేదు, నెరేషన్ లేదు అని రాసింది. డెక్కెన్ క్రానికల్ లో చిరు డాన్స్ లు కూడా సినిమాను కాపాడలేవనేసింది. ఓపెనింగ్ నుంచే మెహర్ రమేష్ సినిమాను ముంచేశాడనేలా ఇండియా టుడే నుంచి కామెంట్స్ పడుతున్నాయి. ఎలా చూసినా హిట్ పడ్డప్పుడు మెచ్చుకున్న వాళ్లే ఫ్లాప్ పడగానే కామెంట్ చేయటం కామన్.. ఈ రివ్యూల్లోని లోతులో నిజాలెంతో కాని, సోషల్ మీడియాలో ఇలా ఆ చానల్ అంటోంది. ఈ పేపర్ అనేస్తోందన్న వార్తలు, వాటికి తోడు నెటీజన్స్ ట్రోలింగ్ మితిమీరిపోయింది.