Natural star Nani : ఆడబిడ్డలపై నాని షాకింగ్ కామెంట్స్.. “కంటే కూతుర్నే కనాలి”
నేచురల్ స్టార్ నాని.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాటు క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఊర మాస్ సినిమా దసరా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Natural star Nani's shocking comments on baby girls
నేచురల్ స్టార్ నాని.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాటు క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఊర మాస్ సినిమా దసరా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఒక్క తెలుగు మాత్రమే హిట్ అయింది. మిగతా భాషల్లో సో సో టాక్ ను సొంతం చేసుకుంది. దసరా లో ఊర మాస్ గా కనిపించిన నాని.. ఇప్పుడు సూపర్ స్టైలిష్ గా మారిపోయాడు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ తప్పుచేశాడా.. ? ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ..?
హాయ్ నాన్న అంటూ పలకరించేందుకు రెడీ అవుతున్నాడు నాని. డిసెంబర్ 7న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా నాని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనకు ఒక కూతురు ఉంటే బాగుండు.. అని తన మనసులో మాటను బయటపెట్టాడు.
2012లో అంజన యలవర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నాని. 2017లో నాని దంపతులకు బాబు పుట్టాడు. అందుకే.. ఇప్పుడు తనకు కుమార్తె కావాలని కోరుకుంటున్నట్లు నాని చెప్పుకొచ్చాడు. అల్రేడీ తాను ఒక కొడుకు తండ్రిని. ఇప్పుడు హాయ్ నాన్న సినిమా వల్ల కూతురికి తండ్రిగా అనుభవం వచ్చింది. కాబట్టి కూతురు కావాలనే కోరిక మరింత పెరిగింది చెప్పుకొచ్చాడు. దీంతో.. నాని దంపతులు మరొక బిడ్డ గురించి ఆలోచిస్తున్నారా అనే చర్చ మొదలైంది. త్వరలోనే నాని గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు.