ఎన్టీఆర్ నిర్మాత మామూలోడు కాదు… 10000 కోట్లా…!
రెబల్ స్టార్ ప్రభాస్ తో మైత్రీ మేకర్స్ నిర్మాత నవీన్ తీసే సినిమా బడ్జెట్ తో పాటు ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ బడ్జెట్ డిటేల్స్ షాక్ ఇస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, చేతి నిండా అరడజన్ పాన్ ఇండియా సినిమాలు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో మైత్రీ మేకర్స్ నిర్మాత నవీన్ తీసే సినిమా బడ్జెట్ తో పాటు ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ బడ్జెట్ డిటేల్స్ షాక్ ఇస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, చేతి నిండా అరడజన్ పాన్ ఇండియా సినిమాలు. ప్రతీ మూవీకి కనీసం 450 నుంచి 500 కోట్ల బడ్జెట్ ఇలా లెక్కేస్తే ఒక తెలుగు నిర్మాత పదివేల కోట్లు పెట్టుబడులు సినిమాల మీదే పెట్టాడనంటున్నారు. వందకోట్ల బడ్జటె్ మూవీల నుంచి 500 కోట్ల బడ్జెట్ వరకు టాలీవుడ్ మూవీ బడ్జెట్ ఎక్కడికో వెళ్లిపోయింది. రాజమౌళి, మహేశ్ సినిమా కూడా 1000 కోట్ల పెట్టుబడితో తీస్తున్నారన్నారు. అంతవరకు ఓకే కాని, ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ నిర్మించే ప్రొడ్యూసర్ మామూలోడు కాదని తేలింది. ఒక్కడే డజన్ల కొద్ది పాన్ ఇండియా మూవీలతో పదివేల కోట్ల షాక్ ఇస్తుండటంతో, పాన్ ఇండియా షేక్ అవుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ లాంచ్ చేసిన డ్రాగన్ బడ్జెట్ 450 కోట్లయితే రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడీ తీస్తున్న సినిమా బడ్జెట్ 400 కోట్లు.. ఇలాంటి సినిమాలు ఒకటి నిర్మిస్తే డేరింగ్ ప్రొడ్యూసర్ అంటారు. కాని అరడజన్ నుంచి డజన్ వరకు పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులన్నీ తానే నిర్మితే ఏమనాలి..ఇలాంటి వింత టాలీవుడ్ లోనే జరుగుతోంది
మైత్రీ మూవీ మేకర్స్ అంటే, పాన్ ఇండియా థౌజెండ్ వాలా క్రాకర్స్ అంటున్నారు. ఎందుకంటే వచ్చేనెల వచ్చే 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప2 మైత్రీమేకర్స్ మూవీనే. 400 కోట్లతో తెరకెక్కుతున్న రెబల్ స్టార్ ఫౌజీ మూవీ మైత్రీ మేకర్స్ దే… ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న 450 కోట్ల బడ్జెట్ మూవీ కూడా మైత్రీ మూవీ మేకర్స్ దే.
ఈ నిర్మాణ సంస్థలో మేయిన్ లీడ్ అయిన నవీన్ ఏకంగా డజన్ వరకు పాన్ ఇండియా మూవీలు తీస్తున్నాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ కూడా నవీనే నిర్మిస్తున్నాడు. 550 కోట్ల ఈ భారీ బడ్జెట్ మూవీనే కాదు, 400 కోట్లు రాబట్టిన హనుమాన్ కి సీక్వెల్ జై హను మాన్ ని కూడా నిర్మించేది తానే
ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ 350కోట్ల బడ్జెట్ తో మూవీ ప్రొడ్యూస్ చేశాడు. రాబిన్ హుడ్ ని, ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా తానే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాల అన్నీంటి బడ్జెట్ చూస్తే 5 వేల కోట్లని తేలింది. ఇక మీదట నిర్మంచే సినిమాల బడ్జెట్ లు లెక్కేస్తే అదో 5 వేల కోట్లని తేలుతోంది.
అంటే ఆల్ మోస్ట్ పదివేల కోట్లు పెట్టుబడులు పాన్ ఇండియా లెవల్లో మైత్రీ మూవీ మేకర్సే పెట్టారంటే, ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌజ్ గా చెప్పొచ్చు.. అందుకే ఈ ప్రొడక్షణ్ హౌజ్ మీద ఆమధ్య ఐటీ రైడ్ కూడా జరిగిందన్నారు. ఏదేమైనా పాన్ ఇండియా హీరోలే కాదు, పాన్ ఇండియా సినిమాలంటే కూడా టాలీవుడ్డే కేరాఫ్ అడ్రస్ అవుతోంది. అలాంటి ప్రొడ్యూసర్ ఇప్పుడుఎన్టీఆర్ తో డ్రాగన్ తోపాటు, నెల్సన్ దిలీప్ మూవీ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హంబలే సంస్థతో కలసి మైత్రీ మూవీ మేకర్స్ 600 కోట్లతో ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో భారీ సెన్సేషణ్ ప్లాన్ చేస్తోంది.