అహంకారి.. ఈగోయిస్ట్.. డిక్టేటర్.. చస్తుంటూ చూసి సంబరపడేరకం..?

లేడీ సూపర్ స్టార్ నయనతార తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. అది కూడా ఏ దర్శకుడినో, నిర్మాతనో కాదు... కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని... పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉన్న తన మీద ఏదో సాదా సీదాగా కామెంట్ చేస్తే ఏమో అనుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2024 | 09:29 PMLast Updated on: Nov 19, 2024 | 9:29 PM

Nayanathara And Vignesh Targets Danush Completely

లేడీ సూపర్ స్టార్ నయనతార తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. అది కూడా ఏ దర్శకుడినో, నిర్మాతనో కాదు… కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని… పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉన్న తన మీద ఏదో సాదా సీదాగా కామెంట్ చేస్తే ఏమో అనుకోవచ్చు. కాని ఈగోయిస్ట్, అహంకారి, డిక్టేటర్, లాంటి పదాలే కాదు, పక్కనోల్లు నరకం అనుభవిస్తుంటే చూసి సంతోషించే శాడిస్ట్ అనేసింది. కేవలం పదాలతోనే కాదు, టన్నుల కొద్ది తన కోపాన్ని వెల్లగక్కింది. చాంతాండత లిస్ట్ తిట్లతో తన బాధని వెల్లకక్కుతూనే, ధనుష్ లోకి ఇంకో రూపాన్ని చూడాల్సిందే అంటూ, ఫ్యాన్స్ కి, తమిళ ప్రజలకి పెద్ద లెటరే రాసింది. నిజంగా ఇది గ్రానైడో, మిసైలో కాదు, ఏకంగా కోలీవుడ్ లో పేలిన అణు బాంబంటున్నారు. ఒక వైపు రజినీ మాజీ అల్లుడా, కంటిన్యూ అయ్యే అల్లుడా అంటూ ఓ చర్చ జరుగుతున్న టైంలో, నయనతార పేల్చిన బాంబుకి సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీటూ ఉధ్యమం మించే ఏదో ఉధ్యమం మొదలయ్యేలా ఉంది. కేవలం ఒక నటి రాసిన లెటర్ తో అంతగా భూమి బద్దలవుతుందా అంటే, పర్యావసానాలెప్పుడు, చిన్నగా మొదలై పెద్దగా ముగుస్తాయి… ఇప్పుడదే జరగబోతోందా? 

నయనతార, హీరో ధనుష్ ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్లుంటారు. సాధారణంగా కాంట్రవర్సీలకు కాలు దువ్వరు… దీనికి తోడు నయనతార లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిందే పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేస్తూ… అలాంటి తను ఫస్ట్ టైం ఒక హీరోని అహంకారి, ఈగోయిస్త్, డిక్టేటర్ అంటూనే మరొకరు నరకం అనుభవిస్తుంటే చూసి సంతోషించే శాడిస్ట్ అనే అర్ధం వచ్చే మాటల తూటాలు పేల్చింది

చాంతాడంతా తిట్ల దండకాన్ని ఓ లెటర్ లో రాసి ధనుష్ మీద విసిరి కొట్టింది.దీనంతటికి కారనం, తన మీద ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీసింది. అందులో తన హిట్ మూవీ నేను రౌడినే వీడియో క్లిప్ ని వాడటంతో, ధనుష్ ఫైర్ అయ్యాడు

ఎందుకంటే నేను రౌడీనే సినిమాకు ప్రొడ్యూసర్ ధనుషే… ఐతే ఈ సినిమాలో నయనతార నటించటమే కాదు, తన భర్త దర్శకత్వం వహించాడు. ఈ జంట కాంబోలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కూడా అయ్యింది. అలాంటి మూవీ తాలూకు 3 సెకన్ల వీడియో తన డాక్యుమెంటరీలో వాడితే 10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ లీగల్ గా రియాక్ట్ అయ్యాడు

అక్కడే నయనతారకి మండిపోయింది. మూడు సెకన్ల వీడియోకి కాపీ రైట్స్ లేకుండా వేశారని 10 కోట్లు అడగటం నిజంగా దిగజారిపోవటమే అనేసింది. ఇక అంటే అక్కడే కట్టలు తెంచిన కోపంతో ధనుష్ తో తనకి గత కొన్నేళ్లుగా ఉన్న గొడవలన్నీంటిని ఓపెన్ చేసింది

ధనుష్ నిజంగా ఓ అహంకారి, ఈగోయిస్ట్..మరోకరు ఎదిగితే ఓర్వని కుళ్లు గునం ఉణ్న వ్యక్తనేసింది. అంతేకాదు తను సింపుల్ వ్యక్తిగా ఆడియోఫంక్షన్స్ లో కనిపిస్తాడు కాని, అదంతా నటనే అనేసింది. తనలో అసలైన కోణం చాలా ఘోరం అంటూనే, మరొకరి ఎదుగుదలని ఓర్వని వ్యక్తిగా తనని జర్మనీ భాషలో ఓ పదం వాడేసింది. దానర్ధం ఒకరు చస్తుంటే చూసిన సంతోషపడే గునం కలవాడనే అర్ధం వచ్చే పదాన్ని తన లెటర్ లో రాసింది

గతంలో తన మూవీ నేను రౌడీనే చేస్తున్న టైంలో ఎక్కడో నయనతారకి నిర్మాత ధనుష్ కి తేడా వచ్చి, ధనుష్ ఈ సినిమా మీద కామెంట్లు చేశాడట. తనే నిర్మించినమూవీ మీద తానే బురద చల్లితే, చివరికి అది బ్లాక్ బస్టర్ అవటంతో ధనుష్ అంచనాలు తారుమారయ్యాయని, అలా తన ఈగో హర్ట్ అయ్యిందని, ఇలా చాలా అంశాల్లో మానసికంగా తానో శాడిస్ట్ అనే అర్ధం వచ్చేలా లెటర్ రాసింది నయనతార

ధనుష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తమిళ జనం, సినీ జనం కూడా కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలంటూనే, ధనుష్ గుణం ఏంటో తెలిసేలా ఇలా లెటర్ తో ఎటాక్ చేసిందంటున్నారు. మామూలుగా అయితే ఓ హీరో మీద ఓ హీరోయిన్ కామెంట్లు ఇంతరియాక్షన్ వచ్చేంది కాదు. కాని కాంట్రవర్సీ జోలికిపోని నయనతార లాంటి హీరోయిన్ ఇలా రియాక్ట్ అవటంతో కోలీవుడ్ ని ఈ అంశం కుదిపేస్తోంది. ఇది కేవలం లెటర్ తో సమసిపోయే వ్యవహారం కాదని అంటున్నారు.ఓ వైపు ధనుష్ కుబేరా రిలీజ్ కి రెడీ అవుతోంది.మరో వైపు సూపర్ స్టార్ కూతురితో తన డివోర్స్ మ్యాటర్ సెటిలైపోతోందన్న టైంలో ధనుష్ ఇలా నెగెటీవ్ న్యూస్ తో వార్తల్లో కెక్కాడు…