Nayanthara: పోటీపడి మరీ రెమ్యునరేషన్ పెంచేసిన నయనతార, దీపిక..!
నయనతార రెమ్యునరేషన్ రూ.10 కోట్లకు చేరడమే కాదు.. సంజయ్ లీలా బన్సాలీ మూవీకి నయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ సినిమాకు రూ.13 కోట్లు తీసుకుంటోందన్న వార్త బాలీవుడ్‌లో చిచ్చు పెట్టింది. సౌత్‌లో నయన నెం.1. కాదనలేం.
Nayanthara: జవాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత నయనతార రెమ్యునరేషన్ ఊహించని రేంజ్‌కు చేరుకుంది. సినిమాకు రూ.10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. జవాన్ తర్వాత నయన తన రెమ్యునరేషన్ పెంచడంతో, అదే సినిమాలో నటించిన దీపిక పదుకొనే కూడా పారితోషికం పెంచేసింది. స్టార్స్ అందరూ రెండు కోట్లు తీసుకుంటున్న టైంలో నయన నాలుగు కోట్లు తీసుకుంది. పెళ్లి, పిల్లలు తర్వాత రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. ఇంతలో జవాన్ బ్లాక్‌బస్టర్‌తో రెమ్యునరేషన్ని డబుల్ చేసిందన్న చర్చ మొదలైంది.
నయనతార రెమ్యునరేషన్ రూ.10 కోట్లకు చేరడమే కాదు.. సంజయ్ లీలా బన్సాలీ మూవీకి నయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ సినిమాకు రూ.13 కోట్లు తీసుకుంటోందన్న వార్త బాలీవుడ్‌లో చిచ్చు పెట్టింది. సౌత్‌లో నయన నెం.1. కాదనలేం. అయితే, బాలీవుడ్‌లో దీపిక పదుకునే రూ.10 కోట్లకు పైగా తీసుకుంటూ టాప్ ప్లేస్‌లో వుంది. దీపిక పదుకునే కల్కి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కల్కి సినిమాకు కెరీర్‌లో ఫస్ట్ టైం ఎక్కువ రెమ్యునరేషన్ రూ.13 కోట్లు తీసుకుందని టాక్. నయనతార హిందీలో నటించిన ఒక సినిమాకే రూ.13 కోట్లు తీసుకుంటే మనమెంత తీసుకోవాలన్న ఫీలింగ్‌లో బాలీవుడ్ భామలు వున్నారట.
నయనకు రూ.13 కోట్లు ఇస్తే దీపిక తన రెమ్యునరేషన్నిరూ.16 కోట్లు చేయడం గ్యారెంటీ అంటున్నారు. దీపిక పదుకునే తర్వాత అలియా సెకండ్ ప్లేస్‌లో వుంటూ రూ.8 కోట్లు తీసుకుంటోంది. ఆమధ్య వచ్చిన ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ కహానీ’ సక్సెస్ క్రెడిట్‌లో ఎక్కువ శాతం అలియా కొట్టేసింది. అందులోనూ గంగూభాయ్‌తో జాతీయ ఉత్తమనటి అనిపించుకుంది. నయన సెకండ్ హిందీ మూవీ రెమ్యునరేషన్ ఆధారంగా అలియా పారితోషికం ఎంతనేది తేలనుంది.