NAYANTHARA SORRY: సారీ..! కావాలని ఆ తప్పు చేయలేదు.. సారీ చెప్పిన నయనతార..
నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా వివాదస్పదమైంది. ఓ వర్గాన్ని కించ పరిచేవిధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమెపై కేసు కూడా నమోదైంది. దాంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగ క్షమాపణలు చెప్పింది. అలాగే ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది నెట్‌ఫ్లిక్స్.
NAYANTHARA SORRY: అన్నపూరణి సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి నయనతార ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. తాము కావాలని ఆ తప్పు చేయలేదని, క్షమించమని ఓ లెటర్ ను X లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా వివాదస్పదమైంది. ఓ వర్గాన్ని కించ పరిచేవిధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమెపై కేసు కూడా నమోదైంది. దాంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగ క్షమాపణలు చెప్పింది. అలాగే ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది నెట్‌ఫ్లిక్స్.
Prabhas: అప్పుడే ఊపేస్తున్న రాజా సాబ్ మేనియా.. రాజా సాబ్.. హిట్టు పక్కా..!
ఇంత గొడవ జరిగిన వారం, పది రోజుల తర్వాత లేట్‌గా స్పందించింది నటి నయనతార. అన్నపూరణి మూవీలో బ్రాహ్మణ యువతిగా నటించింది నయనతార. ఓ సనాతన కుటుంబానికి చెందిన యువతి చెఫ్‌గా ఎలా మారింది..? సక్సెస్ ఎలా అయింది..? అన్నది ఇందులో చూపించారు. అయితే బిర్యానీ చేస్తున్నప్పుడు నమాజ్ చేయడం.. ఆమె నాన్ వెజ్ తినడం లాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సినిమాలో నయనతార.. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నట్టు చూపించడం ద్వారా లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందని కొందరు ఆరోపించారు. అలాగే.. రాముడు మాత్రం మాంసం తినలేదా అంటూ నయనతార ఈ సినిమాలో కామెంట్ చేయడం కూడా వివాదం అయింది.
అన్నపూరణి సినిమాను జీ గ్రూప్ నిర్మించింది. ఇది OTTలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. మూవీపై హిందూ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో జీ సంస్థ క్షమాపణ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్ తమ OTT ప్లాట్‌ఫామ్ నుంచి అన్నపూరణి సినిమాను తొలగించింది. ఆ సంస్థలపై కేసులు కూడా నమోదయ్యాయి. నటి నయనతార మీద కూడా కేసు పెట్టడంతో దానికి రెస్పాండ్ అయిన ఆమె.. క్షమాపణలు చెబుతూ Xలో లెటర్ రిలీజ్ చేసింది. అన్నపూరణి మూవీతో జనంలో మంచి ఆలోచన తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే తీశామని, దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చని చూపించడమే తమ లక్ష్యమని నయనతార తెలిపింది.
ఎవరి మనోభావాలు అయినా దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక కూడా వివాదస్పదం అవడం బాధాకరమన్నది. తాను అన్ని మతాలను సమానంగా చూస్తాననీ.. అన్ని ప్రార్థనా స్థలాలను సందర్శిస్తానని చెప్పింది. ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి పనిచేయలేదని అన్నది నయనతార. మూవీని ఇప్పటికే OTT నుంచి తొలగించడం, ఇప్పుడు నటి నయనతార క్షమాపణలు చెప్పడంతో.. హిందూ సంఘాలు కేసును వెనక్కి తీసుంటాయా లేదా అన్నది చూడాలి.
View this post on Instagram