Nayanthara: స్పెషల్ ఫ్లైట్ కొనేసిన లేడీ సూపర్ స్టార్.. ఎన్ని కోట్లంటే..?
సౌత్‌లో రామ్ చరణ్‌కి చార్టెగ్ ఫ్లైట్ తాలూకు బిజినెస్ ఉంది. అది బిజినెస్ కాబట్టి.. తనని మినహాయిస్తే, మరో హీరోకి సొంతంగా స్పెషల్ ఫ్లైట్ లేదు. ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్ ఉన్నది కేవలం నయనతారకే. నిజంగా ఇది నిజం.. ముంబైలో ఫోర్ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ తీసుకున్న నయనతార అందుకోసం రూ.100 కోట్లు పెట్టుబడిగా పెట్టిందట.
Nayanthara: నయనతార బేసిగ్గా కేరళ కుట్టి. కానీ, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో కూడా చేరింది. ఇప్పుడు రూ.200 కోట్ల ఆస్తికి రారాణిగా మారింది. రూ.50 కోట్ల విలువైన ఛార్టెడ్ ఫ్లైట్ ఓనర్‌గా కూడా షాక్ ఇస్తోంది. సౌత్‌లో రామ్ చరణ్‌కి చార్టెగ్ ఫ్లైట్ తాలూకు బిజినెస్ ఉంది. అది బిజినెస్ కాబట్టి.. తనని మినహాయిస్తే, మరో హీరోకి సొంతంగా స్పెషల్ ఫ్లైట్ లేదు.
ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్ ఉన్నది కేవలం నయనతారకే. నిజంగా ఇది నిజం.. ముంబైలో ఫోర్ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ తీసుకున్న నయనతార అందుకోసం రూ.100 కోట్లు పెట్టుబడిగా పెట్టిందట. ఇంతేనా.. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లో రూ.60 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు, కొచ్చి, చెన్నైలో రెండు విల్లాలు, వీటితో పాటు బీఎమ్‌డబ్ల్యూ కార్, బెంజ్ కార్ సహా ఇతర కార్ల ధరలతో కలిపి తన మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లు. ఇది కాకుండా లిప్‌బామ్ కంపెనీలో వాటలు, దుబాయ్‌లో ఆయిల్ బిజినెస్ తాలూకు షేర్లు.. ఇవన్నీ కలపి నయనతార ఏడాదికి రూ.30 కోట్లు సంపాదిస్తోందట. బాలీవుడ్‌లో దీపికా అండ్ కో ఏడాదికి రూ.వందకోట్లు సంపాదిస్తున్నారు. కాని వాళ్లెవరికీ ఛార్టెడ్ ఫ్లైట్ లేదు.
బాలీవుడ్‌లో శిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, మాధురి దీక్షిత్ కూడా స్పెషల్ ఫ్లైట్‌ని ఓన్ చేసుకున్నహీరోయిన్లు. ఐతే ఇలా సొంతంగా విమానమున్న సౌత్ హీరోయిన్ ఇప్పటి వరకు లేదు. ఆ క్రెడిట్ నయనతారకే సొంతం. ఏదేమైనా డబ్బు దాచుకోవటం కాదు. అనుభవించాలనే మాటని ఈ లేడీ సూపర్ స్టార్ ఫాలో అవుతున్నట్టుంది. పొదుపు, మదుపు, అలానే కొన్ని విషయాల్లో ఖర్చు చేయ్ అన్న పాలసీ ఫాలో అవుతోంది.