100 కోట్లు ఇచ్చినా నయనతార ఆ ‘లెజెండ్’తో నటించదంట.. బాగా హర్ట్ అయినట్టుంది..!
నయనతార.. ఇది కేవలం పేరు కాదు.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు బ్రాండ్. నయనతార అనే పేరు చాలు.. చాలా సినిమాలకు బిజినెస్ అలా జరిగిపోతుంది.

నయనతార.. ఇది కేవలం పేరు కాదు.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు బ్రాండ్. నయనతార అనే పేరు చాలు.. చాలా సినిమాలకు బిజినెస్ అలా జరిగిపోతుంది. ఆ పేరుకున్న మార్కెట్ వ్యాల్యూ అలాంటిది. స్టార్ హీరోలకు కూడా లేని బ్రాండ్ వ్యాల్యూ నయనతారకు ఉంది. అందుకే లేడీస్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. వయసు 40 దాటినా కూడా ఇప్పటికి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. కొన్ని సంవత్సరాలుగా కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే కాకుండా.. స్టార్ హీరోలతో సమానమైన క్యారెక్టర్స్ చేస్తూ తనదైన ముద్ర వేస్తుంది నయన్. నీతో నటించడానికి స్టార్ హీరోని కూడా రెడీగా ఉంటారు. షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది ఈ బ్యూటీ. డెబ్యూతోనే 1100 కోట్ల సినిమా ఖాతాలో పడింది.
కేవలం సౌత్ మాత్రమే కాదు ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరస ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాకు 15 కోట్లకు పైగా పారితోషకం ఇస్తామంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసిన నయనతార ఇప్పుడు వాటికి వీలైనంత దూరంగా ఉంది. తన పాత్రకు తగిన గుర్తింపు ఉంటే తప్ప డేట్స్ ఇవ్వడానికి అసలు ముందుకు రావడం లేదు. రెమ్యూనరేషన్ ఎలాగూ వద్దన్నా వస్తుంది.. అందుకే దాని గురించి అసలు ఆలోచించడం లేదు నయన్. స్టార్ హీరోల సినిమాలో కూడా తన క్యారెక్టర్ సమానంగా ఉంటే తప్ప యస్ చెప్పట్లేదు ఈ బ్యూటీ. ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాల్లో హీరోలు ఉన్నా కూడా నయనతార మెయిన్ క్యారెక్టర్ చేస్తుంది. ఇంకో విషయం కథ నచ్చితే చిన్న పెద్ద అని చూడకుండా ఎలాంటి హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నయన్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే నయనతార ఒక్క హీరోతో మాత్రం జీవితంలో ఎప్పటికీ నటించనని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
15 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా కూడా ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సే లేదని కుండబద్దలు కొట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి నయనతార అంతగా ఏ హీరోతో నటించకూడదు అని కోరుకుంటుందో తెలుసా..? ఆయనెవరో కాదు.. లెజెండ్ శరవణన్..! గోల్డ్ బిజినెస్ తో సూపర్ పాపులర్ అయిన శరవణన్.. కరోనా టైంలో ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన ఇంకో సినిమా చేస్తున్నాడు. అందులో హీరోయిన్ గా నయనతారను అడిగితే వెంటనే నో చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. యాడ్స్ లో శరవణన్ తో హన్సిక, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ సినిమాల విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూడా నో చెప్పారు. అందుకే చిన్న చిన్న హీరోయిన్స్ కు పెద్దపెద్ద రెమ్యూనషన్స్ ఇచ్చి తనతో నటించేలా చేస్తున్నాడు శరవణన్.