నా కొడుకుని అలా మార్చేశాడు… విజయ్ పై నాజర్ సెన్సేషనల్ కామెంట్స్

నాజర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంత దగ్గరైన నటుడు. పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ నటుడి నుంచి చాలా బాగా ఆదరించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 1, 2025 | 03:59 PMLast Updated on: Jan 01, 2025 | 3:59 PM

Nazar Interesting Comments On Vijay

నాజర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంత దగ్గరైన నటుడు. పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ నటుడి నుంచి చాలా బాగా ఆదరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన నాజర్ లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో తన కుమారుడికి జరిగిన యాక్సిడెంట్ రోజులను గుర్తుచేసుకున్న నాజర్ సంచలన విషయాలు బయట పెట్టారు. యాక్సిడెంట్ వల్ల తన కుమారుడు 14 రోజుల కోమాలో ఉన్నాడని గుర్తు చేసుకున్నారు.

స్పృహలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పేర్లు కాకుండా విజయ్ పేరు చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. 2014లో యాక్సిడెంట్లు జరిగినట్టు చెప్పిన నాజర్ వారి జీవితాలను తమిళ స్టార్ హీరో విజయ్ ఎంత ప్రభావితం చేశారో వివరించారు. తన కుమారుడికి జరిగిన యాక్సిడెంట్ ఎంతో బాధాకరమని అయితే అతడు ఆ ప్రమాదం నుంచి ధైర్యంగా బయటికి వచ్చాడని… అతడు విజయ్ చాలా వీరాభిమాని అని ప్రతీ విషయంలో దళపతిని ఫాలో అవుతూ ఉంటాడని చెప్పుకొచ్చారు. అలా చేయడమే ఆక్సిడెంట్ సమయంలో అతడి జ్ఞాపకశక్తిని నిలిపిందన్నారు.

కోమాలో నుంచి స్పృహలోకి రాగానే తమ పేర్లు చెబుతాడేమో అనుకున్నామని… కానీ విజయ్ విజయ్ పేరు చెప్పాడని నాజర్ చెప్పుకొచ్చాడు. వైద్యులు విజయ్ సినిమాలు, పాటలు చూపించారని అతనిలో వచ్చే మార్పులను గమనించామని ఆ విషయం తెలుసుకున్న విజయ్ మా అబ్బాయిని కలిశారని… అప్పటినుంచి వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారని మా అబ్బాయికి ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ విజయ్ గిఫ్ట్ గా ఇచ్చాడని తెలిపారు. అందుకే విజయ్ ఎప్పటికి తనకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకోచ్చారు.

ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. 2024 లో విజయ్ కాస్త సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకున్నాడు. అతనికి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా ఇండియాలో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో తీసుకోలేదు. ప్రస్తుతం తన కెరీర్ లో 69వ సినిమా చేస్తున్న విజయ్ దీని తర్వాత రాజకీయాల్లో బిజీ అయి… తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. ఇదే విజయ్ లాస్ట్ సినిమా అనే వార్తలు కూడా వస్తున్నా.యి విజయ్ కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉండటం అలాగే పార్టీని కూడా స్థాపించడం వంటివి జరిగాయి. ఆటో తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను కూడా తమిళంలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. శ్రీ లీల పాత్రలో మలయాళ హీరోయిన్ మమిత బైజు నటిస్తోంది. కాజల్ పాత్రను పూజ హెగ్డే ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఇక నాజర్ కూడా విజయ్ పెట్టిన పార్టీలోకి వెళ్లే సంకేతాలు ఉన్నాయి.