విడాకుల బాట పడుతున్న నాని హీరోయిన్.. అంత బాగుండేవాళ్ళు.. ఈ జంటకు ఏమైంది..?

ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల సీజన్ నడుస్తుంది. ఒకవైపు పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు విడిపోయేవారు విడిపోతూనే ఉన్నారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2025 | 06:00 PMLast Updated on: Apr 18, 2025 | 6:00 PM

Nazriya And Fahad Fahazil About News

ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల సీజన్ నడుస్తుంది. ఒకవైపు పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు విడిపోయేవారు విడిపోతూనే ఉన్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆమె ఎవరో కాదు నజ్రియా నజీమ్. ప్రముఖ మలయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య ఈమె. పదేళ్ల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు. వాయిస్ రీత్యా ఇద్దరికీ 12 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా కూడా.. ఇన్నేళ్లుగా ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా ఉన్నారు. ఇద్దరిని చూసి ఎంతోమంది సంతోషపడ్డారు కూడా. అభిమానులు అయితే జంట అంటే ఇలా ఉండాలి అంటూ ఎంతో చెప్పుకున్నారు. ఫహద్, నజరియా కూడా మీడియా ముందు ఎప్పుడు చాలా ఆనందంగా కనిపించే వాళ్ళు. కానీ కొన్ని రోజులుగా ఈ ఇద్దరు కలిసి బయట అసలు కనిపించడం లేదు. పైగా ఎవరి దారి వాళ్లదే అన్నట్టు కనిపిస్తున్నారు.

ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు అంటూ కొన్ని రోజులుగా మలయాళ ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి మరింత బలం చేకూరుస్తూ తాజాగా నజరియా నజీమ్ చేసిన ఒక పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. కొన్ని రోజులుగా బాగా డిప్రెషన్ లో ఉన్నాను.. కనీసం సూక్ష్మధర్షిని విజయాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటూ పోస్ట్ చేసింది నజరియా. కొన్నాళ్లుగా చాలా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాను.. వీలైనంత త్వరగా మరింత బలంగా నీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. కొన్ని రోజులుగా చీకటి నా జీవితాన్ని బాగా కమ్మేసిన ఫీలింగ్ వస్తుంది అంటూ ఈమె రాసుకొచ్చిన పెద్ద లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంత పెద్ద లెటర్ రాయడానికి కారణం ఫహాద్ ఫాజిల్ తో ఆమె విడిపోవడానికి నిశ్చయించుకోవడమే అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇన్నేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట సడన్ గా ఇలా విడిపోవాలి అనుకోవడం ఏంటి అంటూ అభిమానులు కూడా కంగారుపడుతున్నారు. అయితే దీని వెనక అసలు నిజం ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇటు ఫహద్ కానీ.. అటు నజ్రియా కానీ ఇప్పటివరకు అధికారికంగా తమ విడాకుల మ్యాటర్ చెప్పలేదు. కానీ ఈ ఇద్దరూ చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు.. విడివిడిగానే ఉంటున్నారు.. అధికారికంగా విడాకులు తీసుకోవడం మాత్రమే తరువాయి అంటే సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతుంది. ఏదేమైనా తనకు నచ్చిన హీరో హీరోయిన్లు ఇలా విడాకులు తీసుకోవాలి అనుకోవడం అభిమానులకు బాధ కలిగించే విషయం.https://www.instagram.com/nazriyafahadh/p/DIgn0v7xSJm/?hl=en