NBK108: బాలయ్యను భయపెడుతున్న మాస్ మహారాజా.. మ్యాటర్ అలాంటిది మరి..!

ఎంత నటసింహం కటౌట్ పెద్దదే అయినా, సెంటిమెంటల్‌గా రవితేజకి భయపడక తప్పట్లేదు. బాలయ్య ఇప్పుడు చిరుతోనో, మిగతా హీరోల సినిమాలతోనో పోటీ పడేందుకు భయపడే పరిస్థితి లేదు. కానీ రవితేజ మూవీ వస్తోందంటే, బాలయ్యే పక్కకు తప్పుకోవాల్సి వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2023 | 06:11 PMLast Updated on: May 27, 2023 | 6:11 PM

Nbk108 Movie Team In Tension Because Of Mass Maharaja Raviteja

NBK108: బాలయ్యని, ఆయన ఫ్యాన్స్‌ని మాస్ మహారాజా రవితేజ భయపెడుతున్నాడు. ఇమేజ్‌లో ఇద్దిరికీ పోలికలేదు. ఎవరి దారి వాళ్లదే. కాని ఇద్దరూ మాస్ హీరోలు. అయినా ఎంత నటసింహం కటౌట్ పెద్దదే అయినా, సెంటిమెంటల్‌గా రవితేజకి భయపడక తప్పట్లేదు. బాలయ్య ఇప్పుడు చిరుతోనో, మిగతా హీరోల సినిమాలతోనో పోటీ పడేందుకు భయపడే పరిస్థితి లేదు.

కానీ రవితేజ మూవీ వస్తోందంటే, బాలయ్యే పక్కకు తప్పుకోవాల్సి వస్తోంది. గతం అంత ఘనంగా, భయంకరంగా ఉంది మరి. అప్పట్లో బాలయ్య మూవీ పరమవీరచక్ర వస్తే, అదొచ్చిన రోజే మిరపకాయ్ మూవీ వచ్చి హిట్టైంది. బాలయ్యకు ఫ్లాపే ఎదురౌంది. ఇక ఒక్క మగాడుమూవీ, కృష్ణ సినిమాలు రెండు ఒకేసారి వస్తే రవితేజ గట్టెక్కాడు. బాలయ్య బొక్క బోర్లా పడ్డాడు. ఇక మిత్రుడు, కిక్ మూవీలు వచ్చినప్పుడు కూడా కిక్‌తో షాక్ ఇచ్చాడు రవితేజ. అందుకే అనిల్ రావిపుడి మేకింగ్‌లో బాలయ్య చేస్తున్న సినిమా దసరాకు ప్లాన్ చేయాలంటే నటసింహం టీం కంగారు పడుతోంది. ఎందుకంటే, అప్పుడే రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావు వస్తోంది.

అనిల్ రావిపుడికి ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియదు. అయినా దసరా పోటీ వద్దని, దీపావళికే రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడట. ఇది ఫ్యాన్స్‌ని ఇరిటేట్ చేసే అంశమే అయినా, సెంటిమెంట్స్ నమ్మే ఇండస్ట్రీ జనం, ఇలా నిర్ణయం తీసుకోవటం పెద్ద విషయమేమీ కాదు.