జపాన్ లో ఆడటం అవసరం… 500 కోట్ల బెట్టింగ్.
ఎన్టీఆర్ దేవర కోసం రంగంలోకి దిగాడు. ఆల్రెడీ రిలీజై 670 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. థియేటర్స్ ని షేక్ చేశాకే, ఓటీటీలో కూడా దూసుకెళ్లి రికార్డులు క్రియేట్ చేసింది దేవర మూవీ.

ఎన్టీఆర్ దేవర కోసం రంగంలోకి దిగాడు. ఆల్రెడీ రిలీజై 670 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. థియేటర్స్ ని షేక్ చేశాకే, ఓటీటీలో కూడా దూసుకెళ్లి రికార్డులు క్రియేట్ చేసింది దేవర మూవీ. అలాంటి సినిమాను కొత్తగా ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తున్నాడు. అందుకోసం తనే రంగంలోకి దిగాడు. జపాన్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, అక్కడ తన ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. బేసిగ్గా ఇండియాలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలైనా, ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలైనా, ఇక్కడ రిలీజైనప్పుడే జపాన్, చైనాలో విడుదల అవ్వటానికి కుదరదు. మన భాషలో అయితే అక్కడ ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. కాని జపనీస్, చైనీస్ భాషల్లో సినిమాలు రిలీజ్ చేయటానికి టైంపడుతుంది. అందుకే లాస్ట్ ఇయర్ వచ్చి వండర్ చేసిన దేవర ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కాబోతోంది. అయితే అక్కడ దేవర కేవలం రిలీజ్ అవటం కాదు, రికార్డు బద్దలు కొట్టాలి…అది ఎన్టీఆర్ కి చాలా అవసరం. దాని మీదే తన రెండు సినిమాల భవిష్యత్తు ఆధారపడింది. ఇంతకి దేవర జపాన్ రిలీజ్ అంతగా ఎన్టీఆర్ కి ఎందుకు అవసరంగా మారింది? అక్కడి రిజల్ట్ తో తన ఫ్యూచర్ ఎలా ఎఫెక్ట్ కాబోతోంది? టేకేలుక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉణ్నాడు. క్లైమాక్స్ తోపాటు, హ్రితిక్ రోషన్ తో ప్లాన్ చేసిన డాన్స్ నెంబర్ ని పూర్తి చేసే ప్రాసెస్ లో, డ్రాగన్ షూటింగ్ ని కూడా పక్కన పెట్టాడు. తను ఎంత హెక్టిక్ వర్క్ తో బిజీ అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ షూటింగ్ కి వెళ్లకుండా వార్2 షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉంటాడు..?ఎన్టీఆర్ లేకుండానే తను లేని సీన్లతో షూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇలాంటి టైంలో సడన్ గా ఎన్టీఆర్ దేవర ప్రమోషన్ కోసం ముందుకొస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో 670 కోట్లు రాబట్టిన సినిమా, అలానే ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసిన మూవీ… అలాంటి సినిమాకు మళ్లీ ఎన్టీఆర్ ప్రమోట్ చేయటం వెనక చాలా పెద్ద కథే ఉంది. అంతకంటే పెద్దగా తన అవసరం అంతగా ఉంది.
దేవర జపాన్ లో మార్చ్ 28న రిలీజ్ కాబోతోంది. అందుకే పనికట్టుకుని జపాన్ ఫ్యాన్స్ లో ఊపు తెచ్చేందుకు ఆల్రెడీ సోషల్ మీడియా లైవ్ లు ఇచ్చాడు తారక్. ఇక జపాన్ లో మార్చ్ 22 న వెళ్లి 28 వరకు అంటే వారం రోజులు జపాన్ లోనే ఉండబోతున్నాడు. అక్కడ ఎనిమిది నగరాల్లో ఫ్యాన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూడబోతున్నాడు.ఆల్రెడీ తనకి జపాన్ లో ఫ్యాన్స్ కొత్త కాదు. యమదొంగ టైం పీరియడ్ నుంచి తనకి జపాన్ లో మెల్లిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగుతూ వచ్చింది. త్రిబుల్ ఆర్, దేవరతో ఆ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే ఇండియా, ఓవర్ సీస్ తో పోలిస్తే జపాన్ మార్కెట్ పెద్దదేం కాదు. అయినా అక్కడి మార్కెట్ తనకి చాలా క్రూసియల్ గా మారింది.
జపాన్, కొరియాలో ఏ సినిమా ఆడియా, వాటికి, మలేషియా, ఇండోనేషియాలో ఈజీగా రీచ్ పెరుగుతుందనే అభిప్రాయముంది. ఇక చైనాలో కూడా ఎన్టీఆర్ వార్2 మూవీని, డ్రాగన్ సినిమాను రిలీజ్ చేయాలనకుంటున్నారు. సో దేవర మూవీ ఏమాత్రం జపాన్, కొరియా, ఇండోనేషియాలో పర్లేదనిపించుకున్నా, డ్రాగన్ కి కొత్త మార్కెట్ తోడయ్యే ఛాన్స్ ఉంది.సో పాన్ ఆసియాలో మార్కెట్ పెరగాలన్నా, తన సినిమాలకు అదనపు వసూల్ల ప్రవాహం కావాలన్నా, జపాన్, కొరియా, ఇండోనేషియా మార్కెట్ లో దేవర దూసుకెళ్లటం ముఖ్యం. అందుకే వార్ 2 షూటింగ్ తో ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నా రోజు సాయంత్రం సోషల్ మీడియా లైవ్ లో జపాన్ ఫ్యాన్స్ ని కలుస్తున్నాడు. మార్చ్ ఎండ్ కి టోక్యోలో ల్యాండ్ కాబోతున్నాడు.