Tollywood, Mega Family3 : నెల‌లు.. ముగ్గురు హీరోలు..

లుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి, మెగా హీరోల‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.. ఇక‌.. మెగా కాంపౌండ్‌ నుంచి సినిమా వస్తుందంటే మెగా ఫ్యాన్స్‌కే కాదు.. సినీ ప్రియుల‌కు కూడా పండ‌గే..ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వ‌చ్చినా చాలు అనుకొని ఎదురు చూసేవాళ్లు కోట్ల‌లో ఉంటారు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 22, 2024 | 05:18 PMLast Updated on: Jan 22, 2024 | 5:18 PM

Needless To Say About The Craze For Mega Family And Mega Heroes In The Telugu Film Industry

తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి, మెగా హీరోల‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.. ఇక‌.. మెగా కాంపౌండ్‌ నుంచి సినిమా వస్తుందంటే మెగా ఫ్యాన్స్‌కే కాదు.. సినీ ప్రియుల‌కు కూడా పండ‌గే..ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వ‌చ్చినా చాలు అనుకొని ఎదురు చూసేవాళ్లు కోట్ల‌లో ఉంటారు.. అలాంటిది మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో ముగ్గురు మెగా హీరోలు స్క్రీన్‌పై సంద‌డి చేస్తే ఎలా ఉంటుంది..? బాక్సాఫీసు బ‌ద్ద‌లైపోదూ.. ఈ ఏడాది కూడా స‌రిగ్గా ఇదే జ‌ర‌గ‌బోతోంది..
మెగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్ డేట్ వ‌చ్చేసింది.. ఈ ఏడాదిలో కూడా మూడు నెలల వ్యవధిలో ముగ్గురు మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.. ద‌ట్ టూ ఆ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావ‌డం మ‌రో విశేషం..

ముందుగా మెగా కాంపౌండ్ నుంచి ఈ ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌గ్గేదేలే అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.. పుష్ప తో ర‌చ్చ రచ్చ చేసిన ఈ స్టైలిష్ స్టార్.. పుష్ప2తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల‌ని చూస్తున్నాడు.. ఈ మూవీని ఆగష్టు 15కి ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. ఈ మూవీపై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యి ఉంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో మూవీ థియేటర్స్ లోకి రానుంది.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్‌చ‌ర‌ణ్‌.. శంక‌ర్ డైరెక్ష‌న్‌లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు.. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాపై విప‌రీత‌మైన క్రేజ్ ఉంది.. క్లైమాక్స్ షూట్ కూడా శంకర్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.. శంక‌ర్‌-చెర్రీ కాంబినేష‌న్‌లో ఎంతో ప్రెస్టేజియ‌స్‌గా వ‌స్తున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లోకి రానుంది.

ఇక మెగా ఫ్యాన్స్ దేవుడిలా కొలుచుకునే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. సుజిత్ డైర‌క్ష‌న్‌లో ఓజీ అనే మూవీలో న‌టిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ 50 శాతం ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.. ఏపీలో ఎల‌క్ష‌న్స్ హ‌డావిడి అయ్యాక‌.. మిగ‌తా షూటింగ్ కంప్లీట్ చేస్తార‌ని టాక్ న‌డుస్తోంది.. అయితే.. ఈ మూవీని త్వ‌ర‌గా కంప్లీట్ చేసి.. త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట.. ఒక‌వేళ అలా జ‌రిగితే.. ఈ మూవీని జూలైలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్‌.. అదే నిజ‌మైతే.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు అంత‌క‌న్నా కావ‌ల్సిందేదీ ఉండ‌దు.. సో.. మొత్తానికి మూడు నెల‌ల గ్యాప్‌లో ముగ్గురు మెగా హీరోలు.. మెగా మూవీ ఫెస్టివ‌ల్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.. ఆ ఫెస్టివ‌ల్‌ను ఎంజాయ్ చేసేందుకు మెగా ఫ్యాన్స్ కూడా ఇప్ప‌టి నుంచే రెడీ అయిపోతున్నారు .