బుధ్ది మారలేదు… 800 కోట్లు మించదంటూ విష ప్రచారం మళ్లీ…

దేవర రిలీజ్ కిముందు ఆడటం కష్టం అన్నారు. ఆడటం కాదు, బాక్సాఫీస్ తో ఎన్టీఆర్ ఆడుకుంటున్నాడు. రెండు మూడొందల కోట్లు కష్ట అన్నారు. ఆల్రెడీ 6 00 కోట్ల వసూల్ల దాటాయి... ప్రివ్యూ రాగానే ఫ్లాప్ అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 9, 2024 | 02:06 PMLast Updated on: Oct 09, 2024 | 2:06 PM

Negativ Talk Spread On Devara

దేవర రిలీజ్ కిముందు ఆడటం కష్టం అన్నారు. ఆడటం కాదు, బాక్సాఫీస్ తో ఎన్టీఆర్ ఆడుకుంటున్నాడు. రెండు మూడొందల కోట్లు కష్ట అన్నారు. ఆల్రెడీ 6 00 కోట్ల వసూల్ల దాటాయి… ప్రివ్యూ రాగానే ఫ్లాప్ అన్నారు. కాని ఎన్టీఆర్ కెరీర్ లోనే త్రిబుల్ ఆర్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అని తేలింది. ఇంతగా దేవరని తొక్కలని, ఎక్కువగా బాలీవుడ్ లో ఒక బ్యాచ్ అదే పని పెట్టుకుంది. ఎన్ని కామెంట్లు చేసినా, కలెక్సన్స్ తో వాళ్ల నోరు మూయించాడు తారక్.. ఇక 680 కోట్ల వసూళ్లు దాటి, వెయ్యికోట్ల వైపు దేవర పరుగుతీస్తుంటే, ఇది 800 కోట్లకు మించదంటున్నారు. అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఇంతకి ఎవరు వాళ్లు..? ఇంతగా దేవర ప్రూవ్ చేసుకున్నాక కూడా, ఏ ధైర్యంతో దేవర వెయ్యికోట్ల జర్నీకి అడ్డు పడుతున్నారు..

దేవర ఒక వైపు రెండుమూడు రోజులకోసారి వందలకోట్ల క్లబ్ లెక్కల్ని మారుస్తూ దూసుకెళుతున్నాడు. కాని ఇంకా బాలీవుడ్ లోసౌత్ హీరోల డామినేషన్ నచ్చని బ్యాచ్ ఇంకా బురద చల్లటం నుంచి బురద చిమ్మే స్థాయికి దిగజారింది. దేవర 800 కోట్ల వసూళ్లను మించలేదు. వెయ్యికోట్లు గగనం అంటున్నారు

దానికో కారణం ఉంది. ఈ మండే వసూళ్లు కాస్త డ్రాప్ అయ్యాయి. మామూలుగా దేవర డేకి 55 నుంచి 80 కోట్ల వరకు వసూళ్లు రాబడుతోంది. కాని మండే మాత్రం 50 నుంచి 55 కోట్లే వచ్చాయి. ఎంత గొప్ప హిట్ మూవీ వచ్చినా, వీకెండ్ బాక్సాఫీస్ బ్యాండ్ పేలుతుంది. సోమవారం కలెక్సన్స్ లో కొంత వరకు డ్రాప్ కనిపిస్తుంది.

కాకపోతే, మరీ 55 నుంచి 80 కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా, ఏ పదికోట్లకో, 20 కోట్లో పడిపోతే, సినిమాకు సీన్ తగ్గిందనుకోవచ్చు. కాని మండే వసూల్లు 55 కోట్లు ఉన్నాయంటే, అదెట్లా హెవీ డ్రాప్ అవుతుంది. దీనికి తోడు ప్రొడ్యూసర్స్ ఎనౌైన్స్ చేసిన 466 కోట్ల నెట్ వసూళ్లని, గ్రాస్ కలెక్షన్స్ గా భావించి, దేవరకి వెయ్యికోట్ల సీన్ లేదంటూ కామెంట్లు షురూచేశారు

దేవర వచ్చే ముందు మరో ఫ్లాప్ అన్నారు. కాని దేవర హిట్ టాక్ తో ఆ నార్త్ యాంటీ ఫ్యాన్స్ కికౌంటర్ పడింది. 172 కోట్ల ఓపెనింగ్స్ తోనే దేవర మీద కామెంట్స్ చేసే వాల్లకి ఫస్డ్ డేనే గట్టి షాక్ తగిలింది.తర్వాత వసూళ్ల వరద పెరగుగుంటే కూడా ఓపెనింగ్స్ తప్ప తర్వాత వసూళ్లు అలా కొనసాగేఛాన్స్ లేదన్నారు

అవన్నీ వట్టి మాటలని 6 రోజుల్లో 400 కోట్లు రాబట్టి ప్రూవ్ చేశాడు తారక్. ఇక దసరా లోపే వెయ్యికోట్ల వసూళ్లొచ్చే సీన్ ఉన్న దేవరకి, 800 కోట్ల వసూళ్లే డెడ్ ఎండ్ అంటూ కొత్తగా కుల్లుని భయట పెట్టుకుంటోంది బాలీవుడ్ లో ఓ వర్గం. కొందరైతే 600 కోట్లకే దేవర జెండా ఎత్తేస్తాడన్నారు. విచిత్రం ఏంటంటే, 730 కోట్ల గ్రాస్ కలెక్సన్స్ వచ్చాక కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే, తెలుగు సినిమా డామినేషన్ ని తట్టుకోలేని బాలీవుడ్ బ్యాచ్ ఎంతగా అసూయతో రగిలిపోతుందో తెలిసిపోతోంది

సలార్, కల్కీ నికూడా ఇలానే ఆడుకోవాలని చూస్తే, వసూళ్ల లెక్కలే వాళ్లనోళ్లు మూయించాయి… ఇప్పుడు దేవర కూడా ఇలానే కలెక్షన్స్ తోనే కామెంట్ల కుల్లు బ్యాచ్ నోళ్లు కుట్టేస్తున్నాడు.