Neha Sharma: ఎంపీగా రాంచరణ్ హీరోయిన్‌.. ఆ పార్టీ నుంచి పోటీ !

చిరుత మూవీలో రాంచరణ్‌ పక్కన యాక్ట్ చేసిన నేహాశర్మ.. లోక్‌సభ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. బిహార్‌లోని భాగల్‌పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కూతురు నేహా శర్మను ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీని కోరారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2024 | 06:46 PMLast Updated on: Mar 23, 2024 | 6:46 PM

Neha Sharma To Contest Lok Sabha Polls From Bihar Actress Father Ajit Sharma Reveals

Neha Sharma: సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం.. ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేం కాదు. నటి రాధిక కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగు రాజకీయాల్లో ఆ లిస్ట్ భారీగానే ఉంటుంది కూడా! అయితే, మరో కుర్ర హీరోయిన్ ఇప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. చిరుత మూవీలో రాంచరణ్‌ పక్కన యాక్ట్ చేసిన నేహాశర్మ.. లోక్‌సభ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

SS RAJAMOULI: నెక్ట్స్ ఏంటి..? రాజమౌళిలానే భయపడుతున్నారు

బిహార్‌లోని భాగల్‌పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కూతురు నేహా శర్మను ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీని కోరారు. ఐతే కూతురు కాకుండా.. తనను పోటీ చేయమన్నా.. బరిలోకి దిగడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. అజిత్‌ శర్మ అన్నారు. బీజేపీకి షాక్ ఇవ్వాలని మహాకూటమి భావిస్తున్న వేళ.. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. నేహా శర్మ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. తండ్రి అజిత్‌ శర్మ కోసం.. నేహా చాలాసార్లు ప్రచారం చేసింది. తెలుగులో మెగా హీరో రామ్‌చరణ్ ఫస్ట్ మూవీ చిరుతలో నేహా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత కుర్రాడు చిత్రంలో కనిపించింది.

ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైన బ్యూటీ.. పలు బాలీవుడ్‌, తమిళ్‌, మలయాళ సినిమాల్లో నటించింది. నేహాశర్మ ఫాదర్‌ అజిత్ శర్మ.. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. భాగల్‌పూర్‌లో జేడీయూ నేత అజయ్‌ కుమార్ మండల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఐతే మహాకూటమిలో భాగంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తే.. తన కూతురు నేహా పోటీ చేస్తుందని అజిత్ శర్మ అంటున్నారు.