MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో.. రామ్ చరణ్ కోసమే కదా!
విశిష్ఠ అతిథికి చిరంజీవితో పాటు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇతర మెగా హీరోలు ఘనంగా స్వాగతం పలికారు. చిరు-చెర్రీతో కలసి కాసేపు సరదాగా మాట్లాడారు. రామ్ చరణ్, చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
MEGASTAR CHIRANJEEVI: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ హైదరాబాద్ వచ్చి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ను కలిశారు. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. ఇంతకీ ఈ విశిష్ఠ అతిథి రాకవెనుక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ ఓటీటీ వేదిక, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో భారీగా ఆడియన్స్ ఆదరణ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ హైదరాబాద్ వచ్చారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే అక్కడి నుంచి నేరుగా మెగాస్టార్ ఇంటికెళ్లారు.
Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ హిట్ కొట్టినట్టేనా..!
విశిష్ఠ అతిథికి చిరంజీవితో పాటు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇతర మెగా హీరోలు ఘనంగా స్వాగతం పలికారు. చిరు-చెర్రీతో కలసి కాసేపు సరదాగా మాట్లాడారు. రామ్ చరణ్, చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన టీమ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చిన ఆయన.. చరణ్‌ని నేరుగా కలవడంపై డిస్కషన్ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ సీఈవో మామూలుగానే వాళ్లను కలిశారా లేక ఈ ఇద్దరితోనూ ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియలేదు. వాస్తవానికి చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీని ఆకాశానికెత్తుతూ సరండోస్ గతంలో ట్వీట్ చేశారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోనూ సంచనలనాలు సృష్టించింది. దీంతో 2022లో వచ్చిన బెస్ట్, మోస్ట్ రెవల్యుషనరీ సినిమా RRR అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ రాగానే నేరుగా రామ్ చరణ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు రామ్ చరణ్.
పైగా ఆ సినిమా ప్రమోషన్ల కోసం అమెరికాలో పర్యటించినప్పుడు కూడా ఎందరో ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్లు, నటీనటులను కలిశాడు. ఇప్పుడు ఏకంగా నెట్‌ఫ్లిక్స్ సీఈవోనే చరణ్ ఇంటికి రావడాన్ని అతని అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. టెడ్ సరాండోస్ వచ్చిన సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఆయన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్, ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు చరణ్ సన్నిహితులు అక్కడే ఉన్నారు. రామ్ చరణ్‌తో నెట్ ఫ్లిక్స్ సీఈఓ సమావేశం ముగిసిన వెంటనే అందరూ సరదాగా సెల్ఫీలు దిగారు. అవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించినా.. పూర్తి స్థాయి సినిమా అంటే గేమ్ ఛేంజరే. అందుకే ఈ మూవీకోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిరంజీవి తన నెక్ట్స్ మూవీని డైరెక్టర్ వశిష్టతో చేస్తున్నాడు. ఇంతకీ నెట్ ఫ్లిక్స్ సీఈఓ రాక వెనుక దోస్తీనా.. ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారా అనే డిస్కషన్ జరుగుతోంది.