పుష్ప పార్ట్ 2 ఓటీటీ రేట్ తెలిస్తే గుండె జారి ఫ్యాంట్ లోకి వస్తది..
పుష్ప ది రూల్... ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోవడంతో అభిమానుల్లో విడుదలపై ఆందోళన కూడా పెరుగుతోంది. వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల అయ్యే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి.
పుష్ప ది రూల్… ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోవడంతో అభిమానుల్లో విడుదలపై ఆందోళన కూడా పెరుగుతోంది. వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల అయ్యే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి. లేదు ఈ ఏడాది డిసెంబర్ లోనే సినిమా వచ్చేస్తుందని సినిమా యూనిట్ చెప్తుంది. క్రమంగా సినిమా మాత్రం షూట్ ఆలస్యం అవుతోంది. బాహుబలి పార్ట్ 2 కంటే పుష్ప 2 నే ఎక్కువ సమయం తీసుకుంది.
దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చేస్తున్నారు. ఇక సినిమా విషయంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా ఆలస్యం అయితే ఇంకా ఇబ్బందనే ఆందోళనలో సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కి భారీ ధరకు అమ్మేసినట్టు వార్తలు వస్తున్నాయి. అన్ని భాషల్లో రైట్స్ ని దాదాపుగా 270 కోట్లకు అమ్మినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 కి మించి పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు చెప్పడం కూడా సినిమాపై హైప్ బాగా పెంచేసింది.
ఇక పార్ట్ 3 కూడా ఉంటుందనే వార్తలు సైతం వస్తున్నాయి. అయితే పార్ట్ 3 కి కనీసం రెండేళ్ళ పాటు పట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కోసం ఇతర దర్శకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప 2 ని భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ కొంటే మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలో పుష్ప సరికొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నట్టే. ఇప్పటి వరకు ఏ ఓటీటీ సంస్థ కూడా ఆ రేంజ్ లో ధైర్యం చేయలేదు అనే చెప్పాలి. మరి పుష్ప 2 డిజిటల్ రైట్స్ ని ఆ రేంజ్ లో కొనడానికి కారణం ఏంటో నెట్ ఫ్లిక్స్ ఏ చెప్పాలి. మొదటి పార్ట్ కు అమెజాన్ లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.