Manchu: ఇంత బలుపేంది మనోజ్.. నాడు మాట్లాడిన మాటల వేడి నేడు తెలుస్తుంది.!
నువ్ ఎంత పెద్ద స్టార్ అయినా కావొచ్చు. కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఎవరితో ఎలా బిహేయ్ చేయాలో నేర్చుకోవాలి. నోటికొచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే తప్పు. ఇప్పుడు ఇలాగే మంచు మనోజ్‌కు క్లాస్ తీసుకుంటున్నారు నెటిజన్లు.
రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో మీడియాపై చిందులు తొక్కాడు మంచు మనోజ్. నవ్వుతూనే రిపోర్టర్స్‌ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడాడు. రీసెంట్‌గా మంచు బ్రదర్స్ మధ్య జరిగిన గొడవ గురించి ఓ రిపోర్టర్ మంచు మనోజ్‌ను క్వశ్చన్ అడిగాడు. రీసెంట్ ఇష్యూ గురించి క్లారిటీ ఇవ్వడం అంటూ అడగగానే.. నాకు రీసెంట్‌గా సెగ్గడ్డ వచ్చింది.. గోకుతారా అంటూ రుసరుసలాడాడు మనోజ్. ఇదే నాకు వచ్చిన రీసెంట్ ఇష్యూ అంటూ తెగ ఓవరాక్షన్ చేశాడు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇంత అహం ఎందుకంటూ మనోజ్ ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.
మీ ఫ్యామిలీ ఇష్యూ బయటికి చెప్పొద్దు అనుకున్నవాడివి ఎందుకు ఆరోజు వీడియో ఇంటర్నెట్‌లో పెట్టావంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అన్నాదమ్ములు కలిసి ఫ్యామిలీ పరువు రోడ్డు మీదకి లాగి.. ఇప్పుడు కవర్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారంటూ క్లాస్ పీకుతున్నారు. పోయి పోయి మీడియాతోనే పెట్టుకుంటే సెగ్గడ్డ నొప్పి రోజూ వస్తుంది జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీలకు, ప్రమోషన్స్‌కు మీడియా కావాలి. మీ ఫ్యామిలీ రాజకీయ జీవితానికీ మీడియా కావాలి. “మా” ఎలక్షన్స్ కోసం మీడియా సపోర్ట్ కావాలి.
ఏ సమస్య వచ్చినా ముందు వచ్చేది మీడియా దగ్గరికే. అప్పుడు ఎవరి మీద ఇలాంటి కోపాలు రావు. ఎందుకంటే అప్పుడు అవసరం మీది కాబట్టి. అవసరం ఉన్నప్పుడు ఆకాశానికెత్తి.. ఇప్పుడు మాత్రం మీడియామీద ఇలా చిందులు తొక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి మంచు ఫ్యామిలీలో అంతో ఇంతో మనోజ్‌కు కాస్త మంచి క్రేజ్ ఉంది. జెన్యూన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరే ఇంటి గొడవలు బయటపెట్టి.. దానిగురించి ప్రశ్నిస్తే మీరే చిర్రెత్తిపోతే.. ఉన్న కాస్త క్రేజ్ కూడా పోగోట్టుకుంటారు జాగ్రత్త అంటూ మనోజ్‌కు సలహా ఇస్తున్నారు నెటిజన్లు.