Bhola Shankar: భోళా శంకర్ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు వరల్డ్‌కప్ గ్యారంటీ..
థంబ్ ఏంటి ఇలా పెట్టారు.. భోళాశంకర్‌కు, టీమిండియాకు లింక్ ఏంటి.. భోళా ఫ్లాప్ అయితే ఇండియాకు వరల్డ్‌కప్ రావడం ఏంటి అని తిట్టుకుంటున్నారా.. ఆగండాగండి.. మొత్తం చూస్తే మీ అభిప్రాయాన్ని మీరే మార్చుకుంటారు మరి.
థంబ్ ఏంటి ఇలా పెట్టారు.. భోళాశంకర్‌కు, టీమిండియాకు లింక్ ఏంటి.. భోళా ఫ్లాప్ అయితే ఇండియాకు వరల్డ్‌కప్ రావడం ఏంటి అని తిట్టుకుంటున్నారా.. ఆగండాగండి.. మొత్తం చూస్తే మీ అభిప్రాయాన్ని మీరే మార్చుకుంటారు మరి. భోళా శంకర్ మూవీకి, క్రికెట్ వరల్డ్‌కప్‌కు లింక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయ్. మెహర్ రమేష్ ఫ్లాప్ తీస్తే.. టీమిండియా వరల్డ్‌కప్ కొడుతుందా అంటే.. అవునే అదే జరుగుతుంది అంటూ సాక్ష్యాలు చూపించి మరీ ఆడుకుంటున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చి భోళా శంకర్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. ఐతే భోళా శంకర్ మూవీ ఫ్లాప్‌గా మిగలడం ఒకరకంగా మంచిదేనని.. ఈ ఫ్లాప్ వల్ల ఈ ఏడాది భారత్ వరల్డ్ కప్ గెలవడం ఖాయమని జోస్యం చెప్తూ మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
సినిమా పోయి బాధలో ఉంటే.. మీ ఎదవ సోది ఏంటి అని ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. అసలు విషయానికి వస్తే.. 2011లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమా రిలీజైంది. ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ సేన విజయం సాధించింది. కప్ నెగ్గింది. 1983 తర్వాత మరోసారి టీమిండియా ప్రపంచ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2013లో మెహర్ రమేష్ ఖాతాలో మరో రాడ్ సినిమా పడింది. అదే వెంకటేష్ హీరోగా వచ్చిన షాడో. వెంకీ కెరీర్‌లోనే ఇది అట్టర్‌ఫ్లాప్. ఆ ఏడాది టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ ఏడాది మళ్లీ వరల్డ్ కప్ జరగబోతుండగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ డిజాస్టర్‌గా మిగిలింది. మెహర్ అన్న రాడ్డు సెంటిమెంట్ కంటిన్యూ అయితే.. ఈసారి కూడా టీమిండియా కప్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి భారత్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన గత రెండు సందర్భాల్లో కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్. మరి హిట్ మ్యాన్‌కు కూడా మెహర్ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.